TTD: ఆగస్టు 18న తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల-tirumala special darshan tickets released on 18th august 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Special Darshan Tickets Released On 18th August 2022

TTD: ఆగస్టు 18న తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Mahendra Maheshwaram HT Telugu
Aug 17, 2022 07:28 AM IST

Tirumala tickets for october month 2022: గురువారం(ఆగస్టు 18) శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Tirumala special darshan tickets: రేపు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేలా టీడీపీ ఏర్పాట్లు చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు మినహా మిగిలిన రోజులకు టికెట్లు ఇవ్వనుంది. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు సర్వదర్శనం మినహా మిగిలిన దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా... దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

తిరుమలలో కుండపోత వర్షం...

మరోవైపు మంగళవారం తిరుమలలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం దాటికి అలిపిరి గేట్ వద్ద రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

వారాంతంలో వరుస సెలవుల రావడంతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ నెలకొన్న సంగతి తెలిసిందే. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. గత కొద్ది నెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. గత రెండేళ్లుగా తిరుమలలో భక్తులకు దర్శనాలు లేకపోవడం, కోవిడ్ ఆంక్షల కారణంగా పరిమిత సంఖ‌్యలో భక్తుల్ని దర్శనానికి అనుమతించేవారు. ఈ ఏడాది కోవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో కార్యక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.

మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లలో నిలబడి ఉన్న వారికి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. తాగునీరు, చిన్నపిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేశారు.

IPL_Entry_Point

టాపిక్