IRCTC Hyd Kerala Tour : హైదరాబాద్ టు అలెప్పీ, మున్నార్ - టూర్ ప్యాకేజీ ఇదే-irctc tourism announced kerala tour package from hyderabad full details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Hyd Kerala Tour : హైదరాబాద్ టు అలెప్పీ, మున్నార్ - టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Hyd Kerala Tour : హైదరాబాద్ టు అలెప్పీ, మున్నార్ - టూర్ ప్యాకేజీ ఇదే

Mahendra Maheshwaram HT Telugu
Aug 31, 2022 08:51 AM IST

hyderabad kerala tour package:హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

<p>హైదరాబాద్ కేరళ టూర్ ప్యాకేజ్</p>
<p>హైదరాబాద్ కేరళ టూర్ ప్యాకేజ్</p> (irctctourism.com)

irctc tourism announced magical kerala tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. MAGICAL KERALAపేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. అలెప్పీ, కొచ్చి, మున్నార్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....

hyderabad - kerala tour: ఈ నెల సెప్టెంబర్ 6వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01 Tuesday: మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. Train No.17230, Sabari Express రైలు ఎక్కుతారు. రాత్రి జర్నీ ఉంటుంది.

Day 02 Wednesday: రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి హెటల్ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కొచ్చి ఫోర్టును సందర్శిస్తారు. రాత్రి కొచ్చిలోనే బస చేస్తారు.

Day 03 Thursday: ఉదయం మున్నార్ కు వెళ్తారు. హెటల్ కి చెకిన్ అయిన తర్వాత... మెట్టుపెట్టి డామ్ ను సందర్శిస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.

Day 04 Friday: నాల్గొరోజు ఎరవికులం జాతీయ పార్క్ ను సందర్శిస్తారు. ఇక్కడ్నుంచి అలెప్పీకి బయల్దేరుతారు. అనంతరం బోటింగ్ ఉంటుంది. సాయంత్రం అలెప్పీ బీచ్ కు వెళ్తారు. హెటల్ లో చెకిన్ అయిన తర్వాత.... రాత్రి అలెప్పీలోనే బస చేయాల్సి ఉంటుంది.

Day 05 Saturday: ఐదో రోజు హెటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడ్నుంచి ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు శబరి ఎక్సె ప్రెస్ లో హైదరాబాద్ కు బయల్దేరుతారు.

Day 06 Sunday: మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే

hyd magical kerala tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 30,060 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 17,270 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,360 గా ఉంది. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

<p>ధరల వివరాలు</p>
ధరల వివరాలు (irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

టాపిక్