IRCTC Tirupati Tour Package : తిరుపతి వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ 'విజయ్ గోవిందం' టూర్ ప్యాకేజీ
IRCTC Tirupati Tour package: తిరుపతి వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. రెండు రోజులు, ముడు రాత్రులు ఈ ప్యాకేజీలో ఉంటాయి. శ్రీవారిని దర్శనం చేసుకుని రావొచ్చు. తిరుచానూరు సందర్శన కూడా ఉంటుంది.
IRCTC Tirupati Tour package: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ మంచి ఆఫర్ చెప్పింది. రెండు రోజులు, మూడు రాత్రులు ఈ ప్యాకేజీలో వెళ్లి రావొచ్చు. విజయ్ గోవిందం పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. రూ.3410 నుంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. బ్రేక్ ఫాస్ట్, హోటల్, శ్రీవారి దర్శన టికెట్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 9న ఉంది.
రైలు మెుదటి రోజు Samalkotలో సాయంత్రం 05:40 గంటలకు బయలుదేరుతుంది. రాజమండ్రి 06:20కి వస్తుంది. విజయవాడ 10:50, తెనాలి 11:20 చేరుకుంటుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
2వ రోజు తిరుపతికి ఉదయం 05:10 గంటలకు చేరుకుంటారు. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయి అల్పాహారం తర్వాత శ్రీవారి దర్శనం కోసం వెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం 08:30 గంటలకు మెుదలవుతుంది. దర్శనం రద్దీని బట్టి ఉంటుంది. అనంతరం తిరుచానూరు ఆలయాన్ని సందర్శిస్తారు. 08:30 గంటలకు రైలు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుని.. తిరుగు పయనమవుతారు.
ఈ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్, కంఫర్ట్ క్లాస్ కోసం 3AC అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్, కంఫర్ట్ క్లాస్ రెండింటికీ తిరుపతిలో AC వసతి ఉంటుంది. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆలయాల్లో సాధారణ దర్శనం కల్పిస్తారు. అల్పాహారం, టూర్ గైడ్ సర్వీస్, ప్రయాణపు భీమా అన్ని కలిపి ప్యాకేజీలోనే ఉంటాయి.
కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీ కోసం రూ.5400, డబుల్ ఆక్యుపెన్సీ కోసం రూ.4660, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.4570, ఐదు నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ రూ. 4160గా ఉంది. బెడ్ లేకుండా అయితే రూ.3540 అందుబాటులో ఉంది. స్టాండర్ట్ కాసులో సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 4240, డబుల్ అయితే రూ.3500, ట్రిపుల్ రూ.3410, ఐదు నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ రూ. 3000గా ఉంది. బెడ్ లేకుండా అయితే రూ.2380 అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ సందర్శించొచ్చు.
ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేయాలనుకుంటే.. మీ ఖాతాకు లాగిన్ చేయండి. మీరు రద్దు చేయాలనుకుంటున్న టికెట్ టూర్ కన్ఫర్మేషన్ నంబర్‌ను ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌లో మీరు బుక్ చేసిన టికెట్ కనిపిస్తుంది. మీ టికెట్ రద్దు www.irctctourism.com వెబ్‌సైట్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. PRS కౌంటర్లలో సాధ్యం కాదు. అయితే ఈ టికెట్ రద్దుకు కూడా కండీషన్స్ ఉంటాయి.