Special Trains : హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
తిరుమల వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టుగా తెలిపింది.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది సౌత్ సెంట్రల్ రైల్వే. ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు ట్రైన్ వివరాలను వెల్లడించింది.
రైలు నంబర్ 07691 రైలు 26వ తేదీన సాయంత్ర 5 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే 27వ తేదీన ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07692 తిరుపతిలో ఆగస్టు 27వ తేదీన రాత్రి 09.55 నిమిషాలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడే, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లిపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.