monkeypox case: కేరళలో మంకీపాక్స్ కేసు.. లాబ్‌కు శాంపిల్స్-suspected monkeypox case found in kerala samples sent for testing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monkeypox Case: కేరళలో మంకీపాక్స్ కేసు.. లాబ్‌కు శాంపిల్స్

monkeypox case: కేరళలో మంకీపాక్స్ కేసు.. లాబ్‌కు శాంపిల్స్

HT Telugu Desk HT Telugu
Jul 14, 2022 10:56 AM IST

కేరళలో మంకీపాక్స్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తి నమూనాను లాబ్‌కు పంపించారు.

విదేశాల నుంచి కేరళకు తిరిగి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడి నుంచి నమూనాలు సేకరించి లాబ్‌కు పంపించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
విదేశాల నుంచి కేరళకు తిరిగి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడి నుంచి నమూనాలు సేకరించి లాబ్‌కు పంపించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. (AFP)

తిరువనంతపురం: విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ గురువారం ఇక్కడ తెలిపారు.

అతడి నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు మంత్రి తెలిపారు.

పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతుందని ఆమె తెలిపారు. సదరు వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలు కలిగి ఉన్నాడని, అతను విదేశాలలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడని జార్జ్ చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం మంకీపాక్స్ అనేది మశూచి రోగులలో గతంలో కనిపించే లక్షణాలతో ఉండే వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్). అయితే ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. 1980లో మశూచి నిర్మూలన పూర్తవడంతో మశూచి వ్యాక్సినేషన్‌ను ఆపివేశారు.

IPL_Entry_Point

టాపిక్