UP BJP Manifesto | ఉచిత విద్యుత్, కఠిన లవ్ జిహాద్ చట్టం, రామాయణ్ యూనివర్సిటీ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ "లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర"ని విడుదల చేశారు. ఇందులో వరాల జల్లు కురిపించారు.
లక్నో: కఠినమైన లవ్ జిహాద్ చట్టం, రైతులకు ఉచిత విద్యుత్, అయోధ్యలో రామాయణ యూనివర్సిటీ వంటి హామీలు బీజేపీ ఇచ్చింది. యూపీ ఎన్నికల కోసం మంగళవారం "లోక కల్యాణ్ సంకల్ప పత్ర"ని విడుదల చేసింది. లవ్ జిహాద్ చట్టం కింద అరెస్టయిన వారికి పదేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా విధిస్తామని చెప్పింది. ఆ పార్టీ ఇచ్చిన మరిన్ని హామీలేంటో చూడండి.
- ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం. వచ్చే ఐదేళ్లలోమొత్తం మూడు కోట్ల ఉద్యోగాలు
- 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం
- కన్యా సుమంగళ యోజన కింద ఇస్తున్న రూ.15 వేలను రూ.25 వేలకు పెంచుతాం
- చెరకు రైతులకు 15 రోజుల్లో డబ్బు చెల్లిస్తాం
- తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసి దేశంలోనే యూపీని నంబర్ వన్ ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతాం
- లతా మంగేష్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ను నెలకొల్పుతాం
- దివ్యాంగులు, వృద్ధులకు రూ.1500 పెన్షన్
- పట్టణ పేదలను దృష్టిలో ఉంచుకొని మా అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటుచేస్తాం
- దారిద్ర్యరేఖకు దిగువను ఉండేవారికి ఏడాదికి రెండు ఉచిత సిలిండర్లు. హోలీకి ఒకటి, దీపావళికి మరొక సిలిండర్ ఉచితం.