IRCTC Tour From Vizag : వైజాగ్ టూ వారణాసి.. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే-irctc announced mahalay pinda daan air package tour from visakhapatnam to varanasi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Tour From Vizag : వైజాగ్ టూ వారణాసి.. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Tour From Vizag : వైజాగ్ టూ వారణాసి.. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే

Anand Sai HT Telugu
Sep 21, 2022 04:43 PM IST

IRCTC Mahalay Pinda Daan Air Package : తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్‌సీటీసీ పలు ప్యాకేజీలను ప్రకటిస్తుంది. కావాల్సిన ప్రదేశాలను చూడాలనుకునేవారు.. కంఫర్ట్ గా వెళ్లి రావొచ్చు. విశాఖ నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం (unplash)

వారణాసి వెళ్లాలనుకునేవారి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను చూడాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. 5 రాత్రులు, 6 రోజులు ఈ ప్యాకేజీని అందిస్తుంది. ALLAHABAD, BODHGAYA, GAYA, PRAYAGRAJ, VARANASI ప్రాంతాలు కవర్ అవుతాయి. మహాలయ పిండ దాన్ ఎయిర్ పేరుతో ప్యాకేజీ అందుబాటులో ఉంది.

Day 1: విశాఖపట్నం - పాట్నా - బుద్ధగయ

విశాఖపట్నం నుండి 08:55 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. పాట్నా విమానాశ్రయానికి మధ్యాహ్నానికి చేరుకుంటారు. తర్వాత బుద్ధగయకు వెళ్లి హోటల్‌కి చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి డిన్నర్ చేసి బస చేయాలి.

Day 2 : గయా-బుద్ధగయ

అల్పాహారం తర్వాత, పిండ ప్రదానం చేయోచ్చు. గయలో ఆచారాలను పూర్తి చేయాలి. తర్వాత బోధ్ గయ ఆలయాన్ని సందర్శించాలి. బుద్ధగయలో రాత్రి బస చేస్తారు.

Day 3 : గయా-వారణాసి

ఉదయం 07:00 గంటలకు వారణాసికి బయలుదేరాలి. సుమారుగా 07-8 గంటల ప్రయాణం చేయాలి. వారణాసిలో హోటల్ లో చెక్ ఇన్ చేయాలి. సాయంత్రం గంగా హారతి చూడొచ్చు. రాత్రి భోజనం చేసి వారణాసిలోనే బస చేస్తారు.

Day 4 : వారణాసి సిటీ టూర్

అల్పాహారం తర్వాత, కాశీ విశ్వనాథ దేవాలయం, అన్నపూర్ణ ఆలయానికి వెళ్లాలి. భోజనానంతరం సారనాథ్ సందర్శించాలి. అనంతరం హోటల్‌కు తిరిగి వెళ్లాలి. వారణాసిలో రాత్రి బస చేస్తారు.

Day 5: వారణాసి-అలహాబాద్

అల్పాహారం తర్వాత, హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి అలహాబాద్‌కు వెళ్లాలి. రాగానే, త్రివేణి సంగమం, అలహాబాద్ కోట, పాటల్‌పురి ఆలయ సందర్శన ఉంటుంది. అలహాబాద్‌లోనే రాత్రి భోజనం మరియు బస చేస్తారు.

Day 6 : ప్రయాగ్‌రాజ్ - విశాఖపట్నం

అల్పాహారం చేసిన తర్వాత ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి వెళ్లాలి. 10:30 గంటలకు డ్రాప్ చేస్తారు. 12:40 గంటలకు విశాఖపట్నం వెళ్లే విమానం ఉంటుంది. రాత్రికి విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూసుకుంటే.. సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.44460గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.35990గా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.34160గా ఐఆర్సీటీసీ నిర్ధారించింది. 24.09.2022న ఈ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది.

Note : పైన పేర్కొన్న టూర్ ప్లానింగ్ IRCTC/లోకల్ టూర్ ఆపరేటర్ కార్యాచరణ సాధ్యాసాధ్యాల ప్రకారం మార్చుకునే హక్కును కలిగి ఉంటుంది. సమయం లేకుంటే.. అన్ని సందర్శనా స్థలాలను చూపించే వీలు ఉండదు అని ఐఆర్సీటీసీ తెలిపింది. ఏదైనా సహజ విపత్తులకు IRCTC బాధ్యత వహించదు. అసాధారణ సంఘటనలు, వాతావరణ పరిస్థితుల కారణంగా సందర్శనా స్థలాలను సందర్శించడం సాధ్యం కాకపోవచ్చు.

Whats_app_banner