IRCTC Hyd Kerala Tour: అలెప్పీ, మున్నార్ అందాలను చూస్తారా… ఇదిగో ప్యాకేజీ-irctc toursim announced kerala tour package from hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Hyd Kerala Tour: అలెప్పీ, మున్నార్ అందాలను చూస్తారా… ఇదిగో ప్యాకేజీ

IRCTC Hyd Kerala Tour: అలెప్పీ, మున్నార్ అందాలను చూస్తారా… ఇదిగో ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu
Sep 21, 2022 01:12 PM IST

hyderabad kerala tour package: హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

<p>హైదరాబాద్ నుంచి కేరళ టూర్</p>
హైదరాబాద్ నుంచి కేరళ టూర్ (www.irctctourism.com)

irctc tourism announced kerala tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'KERALA DELIGHTS EX HYDERABAD' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో అలెప్పీ, కొచ్చి, మున్నార్, త్రివేండం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

hyderabad kerala tour: ఈ నెల అక్టోబర్ 2వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి ఆదివారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది AIR PACKAGE ద్వారా అందిస్తున్నారు.

Day 01 - Hyderabad - Kochi

ఉదయమే శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కొచ్చి విమానాశ్రయం చేరుకుంటారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. కొచ్చి ఫోర్టు, డచ్చ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, సాయంత్రం బీచ్ కి వెళ్తారు. రాత్రి భోజనం తర్వాత కొచ్చిలోనే బస చేస్తారు.

Day 02 - Kochi - Munnar

బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుతారు. అక్కడ్నుంచి మున్నార్ కు వెళ్తారు. మార్గమధ్యలో చియాపార వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మళ్లీ హోటల్ లోకి చెకిన్ అవుతారు. సాయంత్రం టీ మ్యూజియం చూసిన తర్వాత రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు

Day 03 - Munnar

బ్రేక్ ఫాస్ట్ తర్వాత మున్నార్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. మెట్టుపట్టీ డ్యామ్ కు వెళ్తారు. ఏకో పాయింట్, కుండ్లా డ్యామ్ లేక్ చూస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.

Day 04 - Munnar - Thekkady

హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత తెక్కడికి వెళ్తారు. Spice Plantationకి వెళ్తారు. తిరిగి హోటల్ కి వెళ్తారు. రాత్రి తెక్కడిలోనే బస చేయాల్సి ఉంటుంది.

Day 05 - Thekkady - Alleppey/Kumarakom

బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అలెప్పీకి బయల్దేరుతారు. హోస్ బోట్ లో లంచ్ ఉంటుంది. రాత్రి అలెప్పీలోనే బస చేస్తారు.

Day 06 - Alleppey - Trivandrum

అలెప్పీ నుంచి త్రివేండం వెళ్తారు. మార్గమధ్యలో జతయూ ఎర్త్ సెంటర్ కి వెళ్తారు. అనంతరం త్రివేండం వెళ్తారు. రాత్రి కూడా ఇక్కడే బస చేస్తారు.

Day 07: Trivandrum

ఉదయం త్రివేండంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత నపీర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. సాయంత్రం త్రివేండం విమానాశ్రయం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ధరలివే.....

hyd kerala tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 50,800 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 36,500 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.33,550గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి.

<p>ధరల వివరాలు</p>
ధరల వివరాలు (irctctourism)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు

Whats_app_banner