పాకిస్థాన్‌ టీమ్‌ను తాజ్‌ హోటల్‌లో ఉండనిచ్చేదే లేదనుకున్నాం.. గెలిచాం!-we could not let pakistan win and stay in taj hotel says paddy upton about ind vs pak 2011 world cup semis ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  We Could Not Let Pakistan Win And Stay In Taj Hotel Says Paddy Upton About Ind Vs Pak 2011 World Cup Semis

పాకిస్థాన్‌ టీమ్‌ను తాజ్‌ హోటల్‌లో ఉండనిచ్చేదే లేదనుకున్నాం.. గెలిచాం!

Hari Prasad S HT Telugu
Apr 05, 2022 03:07 PM IST

ఇండియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎప్పుడూ భావోద్వేగాలు ఉరకలెత్తుతుంటాయి. అందులోనూ 2011 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ మరింత ప్రత్యేకమని అంటున్నాడు అప్పటి టీమ్‌ మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ ప్యాడీ అప్టాన్‌.

2011 వరల్డ్ కప్ సెమీఫైనల్లో పాకిస్థాన్ పై గెలిచిన ఆనందంలో టీమిండియా
2011 వరల్డ్ కప్ సెమీఫైనల్లో పాకిస్థాన్ పై గెలిచిన ఆనందంలో టీమిండియా (Twitter)

ముంబై: దాయాదుల సమరంలో రెండు జట్ల ప్లేయర్స్‌పై తీవ్ర ఒత్తిడి ఉండటం సహజమే. ఈ రెండు టీమ్స్‌ ఎప్పుడు తలపడినా.. ఇండియా, పాకిస్థాన్‌ అభిమానులకే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. ఫుట్‌బాల్‌లో బ్రెజిల్‌, అర్జెంటీనా మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్‌ ఇండోపాక్‌ క్రికెట్‌ సమరానికి ఉంటుంది. అయితే ఆ క్రికెట్‌ మ్యాచ్‌కు మరికాస్త రాజకీయ ఒత్తిడి తోడైతే ఎలా ఉంటుంది? అది 2011 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లాగా ఉంటుందని అప్పటి టీమ్‌ మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ ప్యాడీ అప్టాన్‌ చెబుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

మరో మాట లేకుండా ఈ మ్యాచ్‌లో గెలవడం ఒక్కటే టీమ్‌ ముందున్న దారి అన్నట్లుగా పరిస్థితి ఉందని అప్టాన్‌ చెప్పాడు. ఎప్పుడూ లేని విధంగా ఈ మ్యాచ్‌కు అదనంగా రాజకీయ ఒత్తిడి కూడా ఉందని వెల్లడించాడు. మొన్న టీమిండియా వరల్డ్‌కప్‌ గెలిచి 11 ఏళ్లయిన సందర్భంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో అప్టాన్‌ ఓ కాలమ్‌ రాశాడు. అందులో ఆసక్తికర విషయాలు చెప్పాడు.

"ఆ మ్యాచ్‌కు అదనపు రాజకీయ ఒత్తిడి ఉంది. ఈ విషయం గురించి బయటకు ఎవరూ చెప్పకపోయినా.. అందరికీ తెలుసు. ఒకవేళ ఇండియా ఓడిపోతే పాకిస్థాన్‌ ముంబైలోని తాజ్‌ హోటల్‌కు వెళ్లి అక్కడ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం బస చేస్తుందని తెలుసు. అక్కడే 2008లో ఉగ్రదాడులు జరిగిన సంగతి తెలుసు కదా. అలాంటి పాకిస్థాన్‌ను అదే తాజ్‌ హోటల్‌లో ఉండనివ్వకూడదని టీమ్‌లోని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అందుకే ఈ మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడిపోకూడదన్న అదనపు ఒత్తిడి ఉంది" అని అప్టాన్‌ ఆ కాలమ్‌లో రాశాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే ఎప్పుడూ సులువే అని, ఈ మ్యాచ్‌ కోసం ప్లేయర్స్‌కు అదనపు మోటివేషన్‌ అవసరం లేదని అతను అనడం విశేషం. నిజానికి అప్పట్లో రెండు దేశాల ప్రేక్షకుల మధ్య వైరం ఉంది తప్ప ప్లేయర్స్‌ మధ్య లేదని, వాళ్లకు ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసని అప్టాన్‌ చెప్పాడు. ఆ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ 85 రన్స్‌ చేయడంతో టీమిండియా 260 రన్స్‌ చేసింది. తర్వాత పాకిస్థాన్‌ 231 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసి టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఆ టీమ్‌లోని చాలా మంది ప్లేయర్స్‌ సచిన్‌కు ఈ వరల్డ్‌కప్‌ గెలిచి గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నట్లు కూడా అప్టాన్‌ చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్