తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp Senior Leader Sunil Deodhar Key Comments On Tdp Bjp Alliance

TDP - BJP Alliance : వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదు!

HT Telugu Desk HT Telugu

22 October 2022, 18:59 IST

    • ap bjp co-in charge sunil deodhar: పొత్తులపై ఏపీ బీజేపీ వ్యవహారాల కో ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ ( ఫైల్ ఫొటో)
ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ ( ఫైల్ ఫొటో) (twitter)

ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ ( ఫైల్ ఫొటో)

Sunil Deodhar On TDP - BJP Alliance: గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ఆసక్తిగా మారుతున్నాయి. జనసేన వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం తారా స్థాయికి చేరిన నేపథ్యంలో... టీడీపీ ఎంట్రీ ఇవ్వటంతో పొత్తుల అంశం తెరపైకి వచ్చేసింది. ఇదే సమయంలో చాలా ఏళ్లుగా బీజేపీతో మైత్రి కొనసాగిస్తూ వచ్చిన జనసేనాని పవన్.... కీలక వ్యాఖ్యలు చేశారు. కాస్త బీజేపీని కర్నార్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే... టీడీపీ అధినేత చంద్రబాబు... స్వయంగా వెళ్లి పవన్ ను కలిశారు. ఇదే ఇప్పుడు ఏపీలో పొత్తుల పొడుపుకు ఆజ్యం పడిందనే చర్చ మొదలైంది.

జనసేనాని పవన్ ను చంద్రబాబు కలవటంతో అందరి చూపు బీజేపీపై పడింది. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా..? అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమును టార్గెట్ చేస్తూ.... పవన్ వ్యాఖ్యలకు మద్దతునిచ్చేలా మాట్లాడారు. సరిగ్గా ఈ పరిణామం ఏపీ బీజేపీలోని లుకలుకలను బయటపడేసినట్లు అయింది. సీన్ కట్ చేస్తే..... ఏపీలోని పొత్తులపై ఏపీ బీజేపీ వ్యవహారాల కో ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో శనివారం మాట్లాడిన ఆయన... టీడీపీ కుటుంబ పార్టీ అని విమర్శించారు. వారితో పొత్తు పెట్టుకోమని... గతంలోనే చేదు అనుభవం ఎదురు చూశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌కు రోడ్డు మ్యాప్ ఇవ్వడం అంశంపై తామే అంతర్గతంగా చర్చించుకుంటామని వెల్లడించారు. బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు.

గతంలోనూ ఇదే రకంగా ప్రకటనలు ఇచ్చారు బీజేపీ నేతలు. ఈ విషయాన్ని సోము వీర్రాజు కూడా చాలా సార్లు స్పష్టం చేశారు. జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని చెప్పారు. సందర్భాను బట్టి వైసీపీతో పాటు టీడీపీని కూడా కర్నర్ చేస్తున్నారు. మొత్తంగా సునీల్ ధియోధర్ వ్యాఖ్యల నేపథ్యంలో.... జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.