తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet 2024 : ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు, మే 4 వరకు అవకాశం

AP LAWCET 2024 : ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు, మే 4 వరకు అవకాశం

28 April 2024, 14:30 IST

    • AP LAWCET 2024 : ఏపీ లాసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకండా మే 4 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచారు.
ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు
ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

AP LAWCET 2024 : ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌(AP LAWCET 2024), పీజీ లాసెట్‌(AP PG LCET 2024) ఉమ్మడి నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీలతో పాటు రెండేళ్ల పీజీ లా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు లా సెట్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు లాసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 4 వరకు లాసెట్(AP LAWCET Application) కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. లాసెట్ కు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జూన్‌ 9,2024 లాసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఏడాది లాసెట్‌ ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University) నిర్వహిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

IRCTC Tirupati Tour Package : తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!

జూన్ 9న లాసెట్ పరీక్ష

మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల కోసం రిజిస్ట్రేషన్(AP Lawcet Registration) ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.800 చెల్లించాలి. పీజీ కోర్సులకు ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్ని ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా చెల్లించాలని నిర్వాహకులు తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో మే 11 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 18 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 25 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో మే 29 వరకు అభ్యర్థులు లాసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 30 నుంచి జూన్ 1 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఇస్తారు. లాసెట్‌ అడ్మిట్‌ కార్డులను(AP LAWCET Admid Card) జూన్‌ 3వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచుతారు. లాసెట్, పీజీ లా సెట్‌ పరీక్షలు జూన్‌ 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.00 గంటల వరకు నిర్వహిస్తారు.

జూన్ 10న ప్రాథమిక కీ

లాసెట్ నిర్వహణ అనంతరం ప్రాథమిక ఆన్సర్ కీ(AP LAWCET Key)ని జూన్ 10న విడుదల చేసి, అభ్యంతరాలపై విండోను జూన్ 11, 2024న ఓపెన్ చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు జూన్ 12 వరకు గడువు ఇస్తారు.

ఏపీ లాసెట్ ఎలా దరఖాస్తు చేయాలి?(How To Apply AP LAWCET 2024)

Step 1 : ఏపీ లాసెట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : హోమ్ పేజీలో Eligibility, Fee Payment ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. ఫీజు చెల్లించాలి.

Step 3 : ఆ తర్వాత ఫీజు పేమంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.

Step 4 : ఫీజు పేమంట్ తర్వాత అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

Step 5 : అభ్యర్థి Print Application form ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.

తదుపరి వ్యాసం