AP LawCet 2024: నేటి నుంచి ఏపీ లాసెట్ 2024, పీజీ లాసెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
AP LawCet 2024: ఏపీ లాసెట్ 2024, పీజీ లాసెట్ రిజిస్ట్రేషన్లను నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లాసెట్ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
AP LawCet 2024: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం Nagarjuna university ఏపీ లాసెట్ 2024 AP Lawcet 2024 రిజిస్ట్రేషన్ Registrationsప్రక్రియను మార్చి 26, 2024న ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024, ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సు ఎల్ఎల్ఎంకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు cets.apsche.ap.gov.in ఏపీ లాసెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ లింక్ను చూడవచ్చు.
AP Lawcet 2024: ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2024, పీజీ లాసెట్ PG Lawcet 2024 ఉమ్మడి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీలతో పాటు రెండేళ్ల పీజీ లా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2024 జూన్ 9 లాసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. లాసెట్ 2024 పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల కోసం లాసెట్ రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.800 చెల్లించాలి. పీజీ కోర్సులకు ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్ని ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
మార్చి 26 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 9న మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం నాలుగు వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
లాసెట్ 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 ఏప్రిల్ 25, 2024. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 మే 3 వరకు ఉంది. కరెక్షన్ విండో మే 30న ప్రారంభమై జూన్ 1, 2024న ముగుస్తుంది.
2024 జూన్ 3 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఏపీ లాసెట్ 2024 పరీక్షను 2024 జూన్ 9న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే విడతలో నిర్వహించనున్నారు.
ప్రొవిజనల్ ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేసి, అభ్యంతరాలపై విండోను జూన్ 11, 2024న ఓపెన్ చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు 2024 జూన్ 12 వరకు గడువు ఉంది.
ఏపీ లాసెట్ 2024 దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx
దరఖాస్తు విధానం
పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
ఏపీ లాసెట్ అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx సందర్శించండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ నింపండి.
అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
పేజీని డౌన్ లోడ్ చేసుకోండి మరియు తదుపరి అవసరానికి దాని హార్డ్ కాపీని ఉంచండి.
మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల కోసం లాసెట్ రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.800 చెల్లించాలి. పీజీ కోర్సులకు ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్ని ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.