Kanna vs Somu : ఏపీ బీజేపీలో పవన్ టెన్షన్… సోము టార్గెట్ గా కన్నా కామెంట్స్..!-kanna lakshmi narayana fires on bjp ap state somu veerraju over pawan comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Kanna Lakshmi Narayana Fires On Bjp Ap State Somu Veerraju Over Pawan Comments

Kanna vs Somu : ఏపీ బీజేపీలో పవన్ టెన్షన్… సోము టార్గెట్ గా కన్నా కామెంట్స్..!

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 05:54 PM IST

పవన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ బీజేపీలో డైలాగ్ వార్ షురూ అయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కన్నా లక్షీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

కన్నా వర్సెస్ సోము వీర్రాజు..!
కన్నా వర్సెస్ సోము వీర్రాజు..!

kanna lakshmi narayana on somu veerraju: బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరోవైపు ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. జనసేన - టీడీపీ మధ్య సయోధ కుదరటం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్... చర్చనీయాంశంగా మారయ్యాయి.

పవన్ తో సోమువీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని కన్నా విమర్శించారు. పవన్ తో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్నారు. సమస్య అంతా సోమువీర్రాజుతోనే అన్న ఆయన... ఒక్కడే అన్ని చూసుకోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదన్నారు - ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కోరారు.

జంప్ అవుతారా..?

పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ... కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ముఖ్య అనుచరులతో భేటీ అవుతారని సమాచారం. వారితో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

ఇక గతంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ పని చేశారు. అమరావతి ఉద్యమంలో చాలా యాక్టివ్ గా ముందుకెళ్లారు. ఆ తర్వాత సోము వీర్రాజుకు ఛాన్స్ దక్కటంతో... అప్పట్నుంచి కాస్త సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ పై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు కన్నా కామెంట్స్.. సోము వీర్రాజు దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన వెళ్లిన ఆయన... తిరిగి ఏపీకి రాకుండా బెంగళూరుకు వెళ్లారని సమాచారం. అయితే కన్నా కామెంట్స్ పై నేతలెవరూ స్పందించొద్దని సోము వీర్రాజు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

టాపిక్