Bjp Somu Veerraju : ఉత్తరాంధ్రకు టీడీపీ, వైసీపీ ఏం చేశారో చెప్పాలన్న సోము
Bjp Somu Veerraju దేశంలో ఒక్కసీటు కూడా గెలవలేని స్థితికి సీపీఐ వచ్చిందని, సీపీఐ జాతీయ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించుకోవాలని, సీపీఐ పార్టీ మనుగడ కోసమే విజయవాడ జాతీయ సభలు నిర్వహిస్తోందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. బీసీలకు సీపీఐ ఎందుకు పార్టీ పగ్గాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ విధానాల వల్లే ఏపీలో ఈ పరిస్థితి తలెత్తిందని, రెండు పార్టీలు ఉత్తరాంధ్రకు ఏం చేశాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.
వైసిపి, టిడిపి తీరు పై మండిపడ్డ సోము వీర్రాజు
ఎపి ని రాజకీయాల కోసం రావణ కాష్టంగా మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి, వైసిపి విధానాల వల్లే నేడు ఎపిలో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అభివృద్ధి చేయలేని పార్టీ లు, అవినీతి పార్టీ లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆరోపించారు. రెండు పార్టీలు విశాఖకు, ఉత్తరాంధ్ర కు ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనానికి టిడిపి, వైసిపిలే కారణం అన్నారు.
ఎపిని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా మోడీ సహకరించారని, జాతీయ రహదారులు, ఐకాన్ బ్రిడ్జి లు, రైల్వే లైన్లు మేము నిర్మించామన్నారు. విశాఖ లో యాభై వేల కోట్ల అభివృద్ధి మేము చేశామని, పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి కాకపోవడానికి ఆ రెండు పార్టీ లే కారణమని ఆరోపించారు. మీకు చెప్పుకునేందుకు వీలు లేక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని సోము ఆరోపించారు. తాము అందరినీ ఏకోన్ముఖులనం చేస్తున్నామని, వైసీపీ, టీడీపీలు స్వలాభం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించార.
సిపిఐ విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. సిపిఐ రాజకీయాల్లో నానాటికి కనుమరుగవుతోందన్నారు. దేశంలో ఎక్కడా ఒక్క స్థానం లేని పరిస్థితి కి ఎందుకు వచ్చిందని అంతర్మధనం చేయాలన్నారు. దీనిపై జాతీయ సమావేశాల్లో వారు చర్చించుకోవాలని, సిద్దాంతపరమైన రాజకీయ పార్టీ గా బిజెపి అభివృద్ధి చెందుతుందన్నారు. బిజెపి ని దించడమే లక్ష్యం అని చెప్పడం వారికి పరిపక్వం లేని ఆలోచనా విధానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ మనుగడ కోసమే నేడు విజయవాడ జాతీయ సభలు పెట్టారని, పేదల పార్టీ అని చెప్పుకునే సిపిఐ నాయకులు బిసికి ఎందుకు పార్టీ పగ్గాలు అప్పగించ లేదని ప్రశ్నించారు. కోట్లాది మంది పేదల కోసం మోడీ అనేక పధకాలు అమలు చేశారని, ఒక్క ఎపిలో రెండు కోట్ల మందికి ఎల్.ఇ.డి బల్బులు ఇచ్చారని, కమ్యూనిస్టు లు అధికారంలోకి రాలేక పోయినా అనేక అంశాలు చెబుతారన్నారు. పేదల సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన చేసిన ఏకైక పార్టీ బిజెపి అన్నారు.
సిపిఐ నేతలు ఆత్మ పరిశీలన చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వైసిపి, టిడిపి తీరు పై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపిని రాజకీయాల కోసం రావణ కాష్టంగా మారుస్తున్నారని ఆరోపించారు. టిడిపి, వైసిపి విధానాల వల్లే నేడు ఎపిలో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అభివృద్ధి చేయలేని పార్టీ లు, అవినీతి పార్టీ లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు విశాఖకు, ఉత్తరాంధ్ర కు ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనానికి టిడిపి, వైసిపిలే కారణమని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా మోడీ సహకరించారని చెప్పారు.
టాపిక్