Pawan Kalyan on Ysrcp Leaders : ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా.. పవన్ సెన్సేషనల్ కామెంట్స్
తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. విడాకులు ఇచ్చి తన ఆస్తులు కూడా ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతల మాదిరిగా ఒకరిని చేసుకుని.. 30 మందితో తిరగలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీపై పవన్ కల్యాణ్ విమర్శలు పెంచారు. ఎప్పుడూ లేనివిధంగా తీవ్రపదజాలంతో మండిపడ్డారు. మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రమైన పదజాలాన్ని వాడారు. తనను ప్యాకేజీ స్టార్(package Star) అంటే చెప్పుతో కొడతానని చెప్పు తీసి చూపించారు. ఒక్కొక్కడ్ని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి కొడతానని చెప్పారు. ఎప్పుడు లేనివిధంగా ప్రసంగం మెుదటి నుంచి చివరి వరకూ.. పవన్ పరుష పదజాలాన్ని వాడారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
'మరోసారి ప్యాకేజీ అంటే మర్యాద దక్కదు. చెప్పు తీసుకొని కొడతా. వైసీపీ గూండాల్లారా ఒంటి చేత్తో మెడ పిసికేస్తా. ప్యాకేజీ అని ఎవరైనా అంటే మాత్రం ఊరుకోను. దవడ వాచిపోయేలా కొడతాను. ఇన్నిరోజులు నా సహనం మిమ్మల్ని కాపాడింది. నేను అందరినీ గౌరవిస్తాను అవతలి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే అస్సలు ఊరుకోను. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. అదే విషయాన్ని పదేపదే మాట్లాడుతున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత మరొకరిని చేసుకున్నాను. చట్ట ప్రకారమే వారికి భరణం చెల్లించా. మొదటి భార్యకు రూ.5కోట్లు, రెండో భార్యకు ఆస్తి రాసిచ్చాను.' అని పవన్ కల్యాణ్ అన్నారు.
గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందామని పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు తాను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారని, 8 ఏళ్లలో 6 సినిమా(Movies)లు చేశానని స్పష్టం చేశారు. రూ.100కోట్ల నుంచి రూ.120కోట్ల ఆదాయం(Income) సంపాదించానన్నారు. రూ.33కోట్లకు పైగా పన్నులు చెల్లించినట్టుగా వివరించారు. తన పిల్లల పేరిట ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed Deposits) తీసి జనసేన(Janasena) పార్టీ కార్యాలయం కోసం ఇచ్చానని గుర్తు చేశారు.
రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.12కోట్లు ఇచ్చినట్టుగా.. అయోధ్య(Ayodhya) రామాలయం నిర్మాణం కోసం రూ.30లక్షలు ఇచ్చానని పవన్ చెప్పారు. పార్టీ పెట్టిన నాటి నుంచి బ్యాంకు ఖాతాల్లో రూ.15.58 కోట్ల కార్పస్‌ఫండ్ విరాళాలు వచ్చాయన్నారు. కౌలు రైతు భరోసా యాత్ర(Bharosa Yatra) కోసం రూ.3.50కోట్లు వచ్చాయని, తన సేన కోసం తన వంతుకు రూ.4 కోట్లు అందాయన్నారు.
వైసీపీ(YSRCP)తో యుద్ధానికి తాను సై అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దేనితో వస్తారో రావాలని సవాల్ విసిరారు. రాడ్లతోనా.. హాకీ స్టిక్కులతోనా అని అడిగారు. ఇప్పటి వరకు తన సహనం చూశారని.. ఇక తన భావ ప్రకటనను స్వేచ్ఛంగా ప్రకటిస్తున్నానని చెప్పారు. ఇక ఈరోజు నుంచే యుద్ధమే.. అని చెప్పారు. వైసీపీలో అందరూ నీచులని అనట్లేదని.. కానీ అందులో నీచుల సమూహం ఎక్కువ అని పవన్ అన్నారు.
కులాల పేరుతో విమర్శలు చేయడం సభ్యతానా? కడుపు కాలితే చేసే పోరాటమే యుద్ధం. అది నా గుండెల్లో ఎలా ప్రవేశించిందో తెలుసా? నా గుండె చప్పుడైన తెలంగాణ(Telangana) నుంచి వచ్చింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఊరకనే చెప్పలేదు. పల్నాటి బ్రహ్మనాయుడని ఆదర్శంగా తీసుకొని చెప్పాను. మాల కులానికి చెందిన కన్నమనాయుడిని సైనికాధిపతి చేశారు. అందరూ సమానమే అని చెప్పేందుకే.. చాపకూడు సిద్ధాం తీసుకొచ్చారు. అధికారం అనేది ఒకటి రెండు కులాలకే పరిమితమైంది. వైసీపీలోని కాపు నేతలు జగన్(Jagan) కు ఊడిగం చేయండి. కానీ కాపులను తక్కువ చేయెుద్దు.
- పవన్ కల్యాణ్