ChandraBabu Tweet : ఏపీ రోడ్ల దుస్థితిపై చంద్రబాబు రీ ట్వీట్….-tdp president chandra babu naidu re tweets central minister tweet on roads situation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp President Chandra Babu Naidu Re Tweets Central Minister Tweet On Roads Situation

ChandraBabu Tweet : ఏపీ రోడ్ల దుస్థితిపై చంద్రబాబు రీ ట్వీట్….

HT Telugu Desk HT Telugu
Oct 17, 2022 01:33 PM IST

ChandraBabu Tweet రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రీట్వీట్ చేశారు. అనకాపల్లి లో దారుణంగా ఉన్న రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. వైఎస్ జగన్ పాలనను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన చంద్రబాబు
కేంద్ర మంత్రి ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన చంద్రబాబు

ChandraBabu Tweet ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ పాలన ఎలా ఉందో కేంద్ర మంత్రులు సైతం గుర్తించారని ఎద్దేవా చేశారు. అయితే జగన్ ప్రభుత్వంలోని ఉత్తమ పాలసీలు చూసో, బెస్ట్ రిజల్స్ చూసో కాదని... మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి అని ఎద్దేవా చేశారు. కేంద్ర పార్లమెంటు వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ ఏపీ రోడ్ల దుస్థితిపై చేసిన ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు.

తన ట్వీట్ లో ఏపీ ప్రభుత్వంపై మురళీధరన్ విమర్శలు గుప్పించారు. 'అనకాపల్లిలోని రోడ్లు దుస్థితిని చూడండి. వైయస్ జగన్ అభివృద్ధి మోడల్ అంటే ఇదేనా? ఈ రోడ్లపై ప్రయాణించడం ఒక శిక్షలాంటిది. ప్రజల ప్రాథమిక అవసరాలను కూడా జగన్ పట్టించుకోవడం లేదని బాబు విమర్శించారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురంకు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది. షేమ్' అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన చంద్రబాబు... వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులపై ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ... ప్రజలు మాత్రం రోడ్డు దాటలేకపోతున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పాలసీలు చూసో...సాధించిన మంచి ఫలితాలు చూసో కాదు...నరకం చూపుతున్న రోడ్లను చూసి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు సైతం రాష్ట్ర రోడ్ల దుస్థితిపై మాట్లాడడం ముఖ్యమంత్రికి షేమ్ గా అనిపించడం లేదా అని నిలదీశారు. రోడ్ల మరమ్మతులపై సిఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.... ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

కేంద్ర మంత్రి ట్వీట్ చేసిన వీడియో చూడండి.

IPL_Entry_Point