TDP and Janasena : టీడీపీ జనసేన పొత్తు కుదిరినట్టేనా……?-pawan kalyan willing to join hands with telugu desam party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp And Janasena : టీడీపీ జనసేన పొత్తు కుదిరినట్టేనా……?

TDP and Janasena : టీడీపీ జనసేన పొత్తు కుదిరినట్టేనా……?

B.S.Chandra HT Telugu
Sep 17, 2022 08:10 AM IST

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న జనసేన పార్టీ టీడీపీతో TDP and Janasena జట్టు కట్టేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగేందుకు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్‌ పదేపదే చెప్పడం వెనుక అంతరార్థం ఇదేనని ఇరు పార్టీల నేతలు బలంగా చెబుతున్నాయి. సీట్ల సర్దుబాటు కుదరడమే మిగిలినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

<p>టీడీపీతో జట్టు కట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారా…?</p>
టీడీపీతో జట్టు కట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారా…?

TDP and Janasena ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లోను వైసీపీని ఓడించి తీరాలని భావిస్తున్న జనసేన పార్టీ అందుకోసం భావసారూప్య పక్షాలతో జట్టు కట్టేందుకు రెడీ అవుతోంది. గత కొంత కాలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెబుతున్న జనసేన, తెలుగుదేశం పార్టీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీతో జట్టు కట్టడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని జనసేన భావిస్తోంది. ఎన్నికల్లో పొత్తు కుదిరితే తమ కోసం ప్రత్యర్థులు కాస్త తగ్గాలంటూ చాలా పెద్ద డిమాండ్‌నే పవన్‌ కళ్యాణ్‌ టీడీపీ ముందు పెట్టారు. ముఖ్యమంత్రి స్థానంపై కన్నేసిన పవన్ కళ్యాణ్‌ అందుకోసం ఇతర రాజకీయ పార్టీలే ఓ అడుగు తగ్గాలని డిమాండ్ చేశారు

TDP and Janasena టీడీపీ, జనసేన పార్టీలలో తెలుగుదేశం పార్టీకి విస్తృతమైన నెట్‌వర్క్‌, క్యాడర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు మాస్ ఇమేజ్ ఉన్నా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే స్థాయిలో లేదు. టీడీపీతో పోలిస్తే జనసేన బలం కాస్త తక్కువే అని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలను సామాజిక కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో రెండు బలమైన సామాజిక వర్గాలు రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. జనసేన బలంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారుండగా, టీడీపీలో కమ్మ వర్గం ప్రాబల్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతూ ఉండటంతో రెడ్డి సామాజిక వర్గాన్ని ఢీకొట్టడానికి కమ్మ, కాపు ఐక్యత అవసరమనే భావన TDP and Janasena పార్టీలలో ఉంది.

టీడీపీతో పొత్తు అనివార్యం కాబట్టి మెజార్టీ స్థానాలలో పోటీ చేసేందుకు జనసేన అవకాశం కోరుతోంది. ప్రస్తుతం టీడీపీ అధినేత మాత్రం 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందిన 18 స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. జనసేన మాత్రం అంతకు మించి ఎక్కువ స్థానాలను ఆశిస్తోంది. కనీసం 40 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలని భావిస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. గెలుపు అవకాశాలు ఎక్కువ గా ఉన్న స్థానాల నుంచి జనసేన అభ్యర్ధలను బరిలో దింపాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా చర్చల వరకు రాకున్నా చాలామంది టీడీపీ నేతలు మాత్రం తాజా పరిణామాలతో అసంతృప్తికి గురవుతున్నారు. తమ స్థానానికి ఎక్కడ జనసేన గండి కొడుతుందోనని టెన్షన్ పడుతున్నారు.

మరోవైపు ఎన్నికల నాటికి మిగిలిన పక్షాలను కూడా కలుపుకుంటే తమకే ఎక్కువ మేలు జరుగుతుందని వైసీపీ భావిస్తోంది. జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే తమ నెత్తిన పాలుపోసినట్టే అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. TDP and Janasena విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి ఆ ప్రభావం వైసీపీపై పడుతుందనే ఆందోళన ఆ పార్టీలో ఉంద

Whats_app_banner