తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bangaram Insta Reels : బంగారం ఒకటి చెప్పనా? ఆమె మనసులో ఇంత బాధ ఉందా?

Bangaram Insta Reels : బంగారం ఒకటి చెప్పనా? ఆమె మనసులో ఇంత బాధ ఉందా?

Anand Sai HT Telugu

15 September 2022, 10:48 IST

    • బంగారం ఒకటి చెప్పనా.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్. సెలబ్రిటీలు సైతం.. ఈ రీల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ రీల్ చేసిన అమ్మాయి గురించి తెలుసా? ఇంతకీ ఆమె అసలు పేరు ఏంటి? తనది ఏ ఊరు?
బంగారం ఒకటి చెప్పనా రీల్స్
బంగారం ఒకటి చెప్పనా రీల్స్ (Instagram)

బంగారం ఒకటి చెప్పనా రీల్స్

ఇది సోషల్ మీడియా కాలం. ఎవరు ఎందుకు ఎప్పుడు ఫేమస్ అవుతారో చెప్పలేం. ఒక్క రోజు చాలు.. జీవితం మారిపోయెందుకు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. బంగారం ఒకటి చెప్పనా.. చీ పోరా.. ఈ మాటలు.. సెలబ్రిటీలు కూడా వాడేస్తున్నారు. ఇక బంగారం అమ్మాయిని తెగ ట్రోల్ చేస్తున్నారు. డీజే పాటలతో మిక్స్ కొట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా బంగారం ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పట్లో ఈ బంగారం ట్రోల్స్ అగేలా లేవు. యూట్యూబ్‌లో మిలియన్ల షార్ట్ వీడియోలు, ట్రోల్స్, మీమ్స్ దర్శనమిస్తాయి. ఇంతకీ ఎవరు ఈ బంగారం?

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

'బంగారం అందరూ అడుగుతున్నారు... నీ బంగారం ఎవరని.. ఏమని చెప్పనూ.. నువ్వూ... దూరం అని చెప్పనా... నా గుండెల్లో ఉన్నావని చెప్పనా... ఒకటి చెప్పనా? చెట్టుకి నీరు పోస్తేనే కదా పూవు పూస్తుంది. అలాగే నా ప్రేమకి నువ్ ప్రేమని పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఛీ పోరా..' ఈ మాటలు ఇప్పుడు తెలుగు రాష్టాల్లో చాలా ఫేమస్. ఊర్లోకి వెళ్లి అడిగినా.. చెప్పేస్తారు. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ రీల్. ఎన్నో ట్రోల్స్, ఎంతో మంది కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. కానీ ఆ రీల్స్ చేస్తున్న అమ్మాయి జీవితంలో మాత్రం ఎంతో బాధ ఉంది.

సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ట్రెండింగ్ లో ఉన్న బంగారం అసలైన పేరు శాంతి. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన అమ్మాయి. పదో తరగతి వరకు చదవుకుంది. ఓ షాపులో వర్క్ చేస్తుంది. నెలకు 5, 6 వేలు వస్తాయి. ఆ అమ్మాయి పవన్ కల్యాణ్ కు పెద్ద ఫ్యాన్. తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పేరు కూడా అదే ఉంటుంది. యాక్టింగ్ అంటే ఆమెకు ఇంట్రస్ట్. చిన్నచిన్నగా రీల్స్ చేయడం ప్రారంభించింది. ఒక్క నెలలోనే బంగారం ఒకటి చెప్పనా అంటూ.. సెలబ్రిటీ అయిపోయింది శాంతి.

అందరూ ఆమె వీడియోలు చూసి తెగ నవ్వుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి జీవితంలో పెద్ద విషాదం ఉంది. బయటకు ఎందుకు చెప్పుకోవడం.. మన వలన నలుగురు నవ్వుకుంటే చాలు అనే మనస్తత్వం తనది. శాంతి తండ్రి మతి స్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన కోసం చాలా వెతికారు. కానీ ఎక్కడ కనిపించలేదు. శాంతితోపాటు అమ్మ, తమ్ముడు ఉంటారు. అమ్మే నాన్నని చంపిందనే మాటలతో కొట్టేవారు. అప్పటికీ శాంతి చిన్న అమ్మాయి. నాన్నపై అమ్మకు ఎంతో ప్రేమ ఉందని శాంతి చెబుతోంది.

శాంతి నాన్న తరఫున వాళ్లు అమ్మని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ బాధలతో శాంతిని హస్టల్ కు పంపింది ఆమె తల్లి. ఇళ్లల్లో పని చేస్తూ పెంచింది. బంగారం వాళ్లకు ఇల్లు కూడా లేదంట. శాంతి వాళ్ల తమ్ముడు.. వాటర్ క్యాన్స్ వేస్తూ ఉండేవాడు. ఇంట్లో ఖర్చులను వీళ్లిద్దరే చూసుకునేవారు. శాంతి తల్లి అనారోగ్యంతో ఉంది. ఇప్పుడు ఆమె ఫేమస్ అయిపోవడంతో నాన్న తరఫు వాళ్ల తమ గురించి చెప్పొద్దని బెదిరిస్తున్నారట. సినిమాల్లో నటించాలని శాంతి బలంగా అనుకుంటోంది. ఇటీవలే రఘు కుంచెను కూడా కలిసినట్టుంది. సెలబ్రిటీలతో కలిసి రీల్స్ చేస్తోంది.