DJ Tillu - 2: డీజే టిల్లు సీక్వెల్ లో రవితేజ హీరోయిన్-sreeleela to play female lead in dj tillu sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sreeleela To Play Female Lead In Dj Tillu Sequel

DJ Tillu - 2: డీజే టిల్లు సీక్వెల్ లో రవితేజ హీరోయిన్

HT Telugu Desk HT Telugu
Aug 19, 2022 06:54 AM IST

పెళ్లి సంద‌డి ఫేమ్ శ్రీలీల ( Sreeleela)టాలీవుడ్‌లో మ‌రో బంప‌రాఫ‌ర్‌ను సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. 2022లో విడుద‌లై పెద్ద విజ‌యాన్ని సాధించిన ఓ సినిమాకు ప్ర‌స్తుతం సీక్వెల్ వ‌స్తోంది. అందులో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆ సీక్వెల్ ఏదంటే...

శ్రీలీల
శ్రీలీల (instagram)

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు సీక్వెల్స్ రాబోతున్నాయి. వాటిలో డీజే టిల్లు -2(DJ Tillu) ఒక‌టి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో చిన్న సినిమాగా విడుద‌లైన డీజే టిల్లు పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది. దాదాపు 10 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఈ సినిమా నిర్మాత‌ల‌కు రెండింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ (Siddu Jonnalagadda)కామెడీ టైమింగ్, డైలాగ్స్ ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి.

ఈ సినిమాకు ప్ర‌స్తుతం సీక్వెల్ తెర‌కెక్కుతోంది. గత నెలలో డీజే టిల్లు-2కు సంబంధించి పూజా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా డీజే టిల్లులో నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. సీక్వెల్‌లో ఆమె స్థానాన్ని మ‌రో క‌థానాయిక‌తో భ‌ర్తీచేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఆ హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ అన్వేష‌ణ సాగిస్తోంది. ఈ సీక్వెల్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

తాజాగా అనుప‌మ స్థానంలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. రాఘ‌వేంద్ర‌రావు పెళ్లి సంద‌డి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది శ్రీలీల‌. ఈ కొత్త పెళ్లి సందడి క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేక‌పోయిన త‌న గ్లామ‌ర్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకున్న‌ది శ్రీలీల. ప్ర‌స్తుతం తెలుగులో బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది.

శ్రీలీలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని డీజే టిల్లులో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్న‌ట్లు తెలిసింది. ప్రజెంట్ తెలుగులో ర‌వితేజ ధ‌మాకా(Ravi teja Dhamaka), న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, వైష్ణ‌వ్‌తేజ్ సినిమాతో పాటుగా గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.