Ravi Teja: రామారావు ఆన్ డ్యూటీ సోషల్ మీడియాలో లీక్.. వీడియోలు వైరల్
రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్ర సన్నివేశాలు లీకయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా సీన్లు లీక్ కావడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సరికొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా శుక్రవారం(జులై 29) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజీష విజయన్ హీరోయిన్లుగా చేశారు. అయితే సినిమా విడుదలకు ముందే చిత్రబృందానికి ఊహించిన షాక్ తగలింది. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు సామాజిక మాధ్యమాల్లో లీకయ్యాయి.
రవితేజ డైలాగులతో కూడిన ఆ సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై చిత్రబృందం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఎడిటింగ్ రూం నుంచి రామారావు ఆన్ డ్యూటీ చిత్ర సన్నివేశాలను లీక్ చేసినట్లు చిత్రబృందం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. లీకైన సన్నివేశంలో అధికార పార్టీపై విరుచుకుపడుతూ పరోక్షంగా రవితేజ పలికిన డైలాగులు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో సినిమా నుంచి సన్నివేశాలు లీక్ కావడం చిత్రబృందాన్ని కలవరపెడుతోంది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈయనతో పాటు రవితేజ తన స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దివ్యాంశ కౌశిక్, రజీశా విజయన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా చేస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు. నాజర్, పవిత్రా లోకేశ్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. జులై 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సంబంధిత కథనం
టాపిక్