CBI Cases : సోషల్ మీడియా పోస్టులపై సిబిఐ అరెస్టులు…. వెంటాడుతున్న కేసులు-cbi arrested seven accused in social media posts against judiciary ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cbi Arrested Seven Accused In Social Media Posts Against Judiciary

CBI Cases : సోషల్ మీడియా పోస్టులపై సిబిఐ అరెస్టులు…. వెంటాడుతున్న కేసులు

HT Telugu Desk HT Telugu
Sep 13, 2022 08:16 AM IST

CBI Cases న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన కేసుల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. దాదాపు ఆర్నెల్లుగా సద్దుమణిగిన ఈ వ్యవహారంలో సిబిఐ దూకుడు పెంచింది. వంద మందికి పైగా సిబిఐ కేసులు నమోదు చేసింది. నిందితుల్ని విడత వారీగా అరెస్ట్ చేస్తున్న సిబిఐ న్యాయమూర్తుల్ని దూషించడం ఉద్దేశపూర్వకమని ఆరోపిస్తోంది.

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏడుగురి అరెస్ట్‌
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏడుగురి అరెస్ట్‌

CBI Cases సోషల్‌ మీడియా వేదికలపై న్యాయమూర్తులను దూషించిన కేసులో ఏడుగురు నిందితులను సోమవారం సీబీఐ అరెస్టు చేసింది. గత వారం విచారణకు హాజరు కావాలని నిందితులకు నోటీసులు ఇచ్చిన సిబిఐ సోమవారం నిందితుల్ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచింది.

ట్రెండింగ్ వార్తలు

CBI Cases ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో తీర్పులు వచ్చిన ప్రతిసారి సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, కోర్టు తీర్పులకు దురుద్దేశాలు అపాదించడం, కొందరికి అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించడం, కొన్ని సందర్భాల్లో విమర్శలు శృతి మించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడంపై రెండేళ్ల క్రితం హైకోర్టు ఆదేశాలతో రిజిస్ట్రర్‌ జనరల్ సిబిఐకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికలపై పోస్టులు పెట్టే వారికి సంబంధించిన వ్యవహారంపై విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. దాదాపు ఏడాదిన్నరగా ఈ కేసులో భాగంగా పలువుర్ని అరెస్ట్ చేస్తోంది. వంద మందికి పైగా నిందితుల్ని సిబిఐ గుర్తించింది. వీరిలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు.

CBI Cases ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు దురుద్దేశాలు అపాదించిన వ్యవహారంలో పలువురు నిందితుల్ని సిబిఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఏడాదిన్నర కాలంలో ఈ కేసులో సిబిఐ చాలామందిని ప్రశ్నించింది. ఘాటైన విమర్శలు చేసిన వారిలో పరిధిని దాటిన వారిని మాత్రం ప్రత్యేకంగా గుర్తించింది. వారి బ్యాంకు లావాదేవీలు, సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణకు నగదు చెల్లిస్తున్న వారి వివరాలను సిబిఐ సేకరించింది. ఖచ్చితమైన లక్ష్యాలతో సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయిన వారిని గుర్తించిన సిబిఐ పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత వారిని అరెస్ట్ చేస్తోంది.

CBI Cases సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో ఇప్పటి వరకు అరెస్ట్‌ అయిన వారిలో ఎవరికి చార్జిషీటు దాఖలు చేసే వరకు కనీసం బెయిల్ కూడా మంజూరు కాలేదు. సోమవారం అరెస్టైన వారిలో పలువురు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సంస్థల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు సిబిఐ గుర్తించింది. దీంతో ప్రభుత్వ ప్రమేయంపై కూడా సిబిఐ అరా తీస్తోంది.

CBI Cases హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన బతుళ్ల అశోక్‌రెడ్డి, పల్నాడు జిల్లా నరసరావుపేటవాసి ప్రదీప్ కుమార్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రంగారావు, గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన పి.సుమ, ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జునరావు, హైదరాబాద్‌కు చెందిన చొక్కా రవీంద్ర, ప్రకాశం జిల్లా పొదిలివాసి పి.రామాంజనేయరెడ్డి వీరిలో ఉన్నారు.

CBI Cases సోషల్‌ మీడియా కేసుల్లో అరెస్టైన వారిని సోమవారం రాత్రి విజయవాడ ఐదో చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి జ్యోత్స్న ముందు వీరిని హాజరుపరిచారు. ఈ నెల 26వ తేదీ వరకు వీరికి రిమాండ్‌ విధించారు. అనంతరం విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. న్యాయ మూర్తులను దూషిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్టయినవారి సంఖ్య 18కి చేరింది. గతంలో 11 మందిని సీబీఐ అరెస్టు చేసింది.

CBI Cases న్యాయమూర్తులను కించపరిచే లా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సీరియ్‌సగా పరిగణించి విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర సీఐడీని అదేశించింది. సిఐడి ఒక్కరినీ కూడా అరెస్టుచేయకపోవడంతో కేసును సీబీఐకి బదిలీ చేస్తూ గత ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలిచ్చింది. రంగంలోకి దిగిన సీబీఐ.. బాధ్యుల ఆనవాళ్లు పసిగట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాం తాల్లో, ఇతర దేశాల్లో ఉన్న వారి పాత్రపై ఆధారాలు సేకరించింది. లభించిన ఆధారాల మేరకు 18 మందికి పైగా నోటీసులు జారీ చేసి అరెస్ట్‌ చేస్తున్నారు. సోమవారం సిబిఐ అరెస్ట్ చేసిన వారిలో ఏపీ ప్రభుత్వ సోషల్ మీడియా బాధ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది

IPL_Entry_Point