తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  46280 Crore Investments By Large Industries In Andhra Pradesh

Investments In AP : ఏపీకి రూ.46,280 కోట్ల పెట్టుబడులు.. 62, 541 మందికి ఉపాధి

Anand Sai HT Telugu

20 September 2022, 16:42 IST

    • CM Jagan On Investments : మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పరిశ్రమల ద్వారా రూ.46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 99 భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. వేల మందికి ఉపాధి దొరికింది.
ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (twitter)

ఏపీ సీఎం జగన్

వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) అధికారంలోకి వచ్చాక.. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు భారీ పరిశ్రమల ద్వారా రూ.46,280 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్(CM Jagan) అసెంబ్లీలో తెలిపారు. ఈ పరిశ్రమల్లో 62, 541 మందికి ఉపాధి లభించిందని, మరో 40 వేల మందికి త్వరలో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(Ease Of Doing Business) స్కేల్‌లో ఏపీ 11.74 శాతం వృద్ధిని సాధించిందని సీఎం జగన్ అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్స్ పార్క్ ప్రాజెక్ట్(Bulk Drug Park Project) కోసం పదిహేడు రాష్ట్రాలు పోటీ పడగా ఏపీ విజయం సాధించింది. ఏపీలో పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కేంద్రానికి లేఖలు రాసిందని జగన్ ఆరోపించారు.

కాకినాడలో బల్క్ డ్రగ్స్ పార్క్ ద్వారా దాదాపు 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు జగన్. ప్రాజెక్టును దక్కించుకోలేక తెలంగాణ(Telangana), మహారాష్ట్ర కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాయన్నారు. అయినా చంద్రబాబు(Chandrababu) నాయుడు, ఆయన మనుషులు తప్పుడు ప్రచారం చేస్తూ ఏపీని పరువు తీసేలా చులకనగా మాట్లాడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలో 99 పరిశ్రమలు రూ.46,280 కోట్ల పెట్టుబడితో 62,541 మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు.

APలో త్వరలో రానున్న నాలుగు కేంద్ర ప్రభుత్వ PSUల ద్వారా దాదాపు 40,000 ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని సీఎం చెప్పారు. HPCL, ONGC, BEL వంటి నాలుగు CPSUలు ఆసక్తిని ప్రదర్శించగా 10 ప్రధాన పరిశ్రమల స్థాపనకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయ.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈఓడీబీలో రాష్ట్రం బాగా రాణిస్తోందని సీఎం జగన్ చెప్పారు. మారిన పద్ధతిలో కూడా పారిశ్రామికవేత్తలు మాత్రమే అన్ని మార్కులు ఇస్తున్నారని, వృద్ధి రేటు 11.43 శాతం నమోదైందని చెప్పారు. 'మేం పారిశ్రామికవేత్తలకు విశ్వాసం ఇస్తున్నాం. పారదర్శకతకు భరోసా ఇస్తున్వాం. అందుకే పెట్టుబడులు రావడం ప్రారంభించాయి. టాటాలు, బిర్లాలు, అదానీలు వంటి పరిశ్రమల సారథిలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ వైపు మొగ్గుచూపుతున్నారు.' అని సీఎం జగన్ అన్నారు.

ఇన్సెంటివ్‌లు ఇచ్చి ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించామని జగన్ అన్నారు. ఈ రంగం ఒక్కటే 12 లక్షల ఉద్యోగాలను అందిస్తుందన్నారు. మేం గత ప్రభుత్వ బకాయిలను కూడా క్లియర్ చేశామని చెప్పారు. ఇది కాకుండా ప్రోత్సాహకాల ద్వారా ప్రధాన పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వివిధ పథకాల క్రింద స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వెల్లడించారు.

'వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌, కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌, జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌తో పాటు స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మరోవైపు రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్(Skill Development) ద్వారా యువతను ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నాం. మూడు పారిశ్రామిక కారిడార్లకు రాష్ట్రం అనుమతులు పొందవచ్చు. గత ప్రభుత్వ హయాంలో 34,108 ఉద్యోగాలు కల్పించగా, గత మూడేళ్లలో మా ప్రభుత్వం 6.13 లక్షల ఉద్యోగాలు కల్పించింది.' అని జగన్ చెప్పారు.