Cm YS Jagan : కేంద్రం అప్పులు, బాబు అప్పుల కన్నా తక్కువే అంటున్న జగన్ …-ap debit burdain is less then central government and earlier tdp government ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Debit Burdain Is Less Then Central Government And Earlier Tdp Government

Cm YS Jagan : కేంద్రం అప్పులు, బాబు అప్పుల కన్నా తక్కువే అంటున్న జగన్ …

B.S.Chandra HT Telugu
Sep 16, 2022 06:20 PM IST

Cm YS Jagan ఎనిమిదేళ్లలో కేంద్రంలో బీజేపీ చేసిన అప్పులు, ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అప్పుల కంటే మూడున్నరేళ్లలో తాము చేసిన అప్పులు తక్కువేనన్నారు ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి తెచ్చిన అప్పులు పేదలకు పంచామే తప్ప దుర్వినియోగం చేయలేదని ప్రకటించారు.

సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
సీఎం జగన్ (ఫైల్ ఫొటో) (twitter)

Cm YS Jagan ఆంధ్రప్రదేశ్‌ అప్పులు ఆందోళనకర స్థాయిలో ఏమి లేవని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు, టీడీపీ అనుకూల పత్రికలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ అనేది పెద్ద సవాలు అని, కేంద్రంతో పోలిస్తే ఏపీ చేసిన అప్పు గణనీయంగా తగ్గిందని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం, కేంద్రం కంటే మెరుగ్గానే ఏపీ ఆర్ధిక వ్యవస్థ ఉందని,. అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని పరిస్థితులు మెరుగ్గా లేవని దుష్ప్రచారం జరుగుతోందని ప్రజలు వాటిని గమనించాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రం బాగున్నా శ్రీలంక తరహాలో పరిస్థితులు ఉన్నాయని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సిఎం ఆరోపించారు. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నా ఏపీ స్థూల ఉత్పత్తి గణనీయంగానే పెరిగిందని చెప్పారు. 2021-22లో 11.43 శాతం జీఎస్డీపీ పెరుగుదలతో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, గడచిన మూడేళ్లలో సగటున 5 శాతం జిఎస్టీ వృద్ధి పెరిగిందని చెప్పారు. ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే తలసరి ఆదాయ వృద్ధి కనిపిస్తే మిగతా రాష్ట్రాల్లో తిరోగమనంలో ఉన్నాయన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా లాంటి పథకాలు పనికి వస్తున్నాయని చెప్పారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మూల ధన వ్యయం చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తున్నారని విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో నిజం ఎంతుందో ప్రజలంతా తెలుసుకోవాలని కోరారు Cm YS Jagan. గతంలో రుణాల పెరుగుదల సాలీనా 17.4 శాతం ఉంటే ప్రస్తుతం 12.7 శాతం మాత్రమే పెరుగుదల ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 3,82,165 కోట్లు మాత్రమే రుణాలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు 1,17,730 కోట్లు ఉందని, రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు 4,99,895 కోట్లకు చేరిందన్నారు. మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణ భారం 52.07 శాతం మాత్రమే ఉందన్నారు. జీడీపీలో రుణ శాతం దేశ సగటుతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని, కేంద్ర రుణాలు- రాష్ట్ర రుణాలూ పెరిగిన తీరును చూసినా ఏపీ పనితీరు అవగతం అవుతుందన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి రాష్ట్ర రుణం 1.20 లక్షలు ఉంటే చంద్రబాబు హయాంలో 2,69,462 కోట్లకు పెరిగాయని, అప్పట్లో అప్పుల వ్యవహారంపై వార్తలే రాలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక చంద్రబాబు ప్రభుత్వంలో 123.53 శాతం మేర రుణాలు పెరిగాయన్నారు.

2019 మే 31 తేదీనాటికి ఉన్న ఏపీకి ఉన్న అప్పులు 2,69,462 కోట్లుగా ఉన్నాయని, మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మార్చి 31 నాటికి ఉన్న రుణం 3,82,165 కోట్లు మాత్రమేని Cm YS Jagan అన్నారు. కోవిడ్ లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నా ఏపీ గణనీయంగా వృద్ధి సాధించిందని, అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందనే దుష్ప్రచారం కూడా చేస్తున్నారని, తీసుకున్న రుణాలకు వడ్డీల కింద 21,499 కోట్లు, రుణంగా 14,558 కోట్లు చెల్లించామని చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి 75,696 కోట్ల వచ్చిందని, ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధి రేటు పరుగులు పెడుతోంది. రాష్ట్ర రెవెన్యూ కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసే సమయానికి గత ప్రభుత్వం కంటె మెరుగైన పనితీరు కనపరుస్తామన్నారు.

మూలధన వ్యయం గురించిన దుష్ప్రచారం కూడా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. సంక్షేమ పథకాలు, ప్రజాకర్షకర పథకాల పైనే డబ్బులు వ్యయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని,ఇదంతా అవాస్తవం అన్నారు. మూడేళ్లలో మూలధన వ్యయంగా భారీ మొత్తాన్నే ఖర్చు చేశామని, విద్య, వైద్యం నాడు నేడు కార్యక్రమాలు, వ్యవసాయ రంగాలకు ఈ వ్యయం జరిగిందన్నారు. మూల ధన వ్యయం కింద 2014- 19 వరకూ 76,139 కోట్లు వ్యయం చేస్తే గడచిన మూడేళ్లలోనే తమ ప్రభుత్వం 55,086 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పింది.

15 ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం పన్నుల ఆదాయాన్ని పంచడం లేదని, ఏపీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం 32 శాతం మాత్రమే పన్నుల ఆదాయాన్ని కేంద్రం ఇచ్చిందని చెప్పారు. పాలనలో తెచ్చిన సంస్కరణలు, డీబీటీ లాంటి విధానాలు, సుపరిపాలన, ఆర్ధిక క్రమశిక్షణ వల్ల పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు. ఇంత చేస్తున్నా ఉద్దేశ పూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని, ఇంత బడ్జెట్ ఉన్నా చంద్రబాబు హయాంలో అమ్మ ఒడి పథకం లేదు, రైతు భరోసా లేదు, చేయూత ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.

IPL_Entry_Point

టాపిక్