Amala Paul Rejected Ponniyin Selvan: మణిరత్నం ప్రాజెక్టును తిరస్కరించిన అమలా పాల్.. ఎందుకో తెలుసా?
Amala Paul Rejected Mani Ratnam Movie: అమలా పాల్.. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో నటించకపోవడానికి గల కారణాన్ని తెలియజేసింది. ఈ సినిమాలో ముందుకు ఆఫర్ అమలా వద్దకు రాగా.. ఆమె తిరస్కరించింది.
Amala Paul About Ponniyn Selvan: ప్రముఖ నటి అమలా పాల్ తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపుదగ్గ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. తనదైన నటనతో ఆడియెన్స్‌ను ఆదరణ చూరగొంది. ఈ ఏడాది ఇప్పటికే కడవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమలా పాల్.. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఆఫర్ వచ్చినా తిరస్కరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ అంశం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమలా పాల్.. ఆసక్తికర విషయాలను పంచుకుంది.
పొన్నియిన్ సెల్వన్ చిత్రం తిరస్కరించడానికి నా వద్ద విలువైన కారణముంది. ఈ సినిమా కోసం మణిరత్నం సర్ నాకు ఆడిషన్ నిర్వహించారు. నేను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశాను. ఎందుకంటే నేను మణిరత్నంకు పెద్ద ఫ్యాన్. కానీ ఆ సమయంలో ఆ ఆఫర్ నాకు దక్కలేదు. అప్పుడు నేను చాలా నిరాశ, బాధకు లోనయ్యాను. అని అమలా పాల్ స్పష్టం చేసింది.
అయితే 2021లో తనకు పొన్నియిన్ సెల్వన్‌లో నటించాల్సిందిగా మళ్లీ అవకాశమొచ్చిందని అమల తెలిపారు. "2021లో మళ్లీ పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్టులో నటిచే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో ఆ చిత్రం చేసే మానసిక స్థితిలో నేను లేను. అందుకే నేను చేయలేనని చెప్పాను. ఒకవేళ ఈ నిర్ణయంపై మీరు బాధపడుతున్నారా? అని నన్ను ప్రశ్నిస్తే.. లేదని స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే కొన్ని విషయాలు కచ్చితంగా ఉంటాయి. కచ్చితంగా రూపొందిస్తారు. వాటిని మనం ఎలా చూస్తామో.. అలా మాత్రమే ఉంటాయని నేను భావిస్తున్నాను" అని అమలా పాల్ చెప్పింది.
పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, రెహమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. సెప్టెంబరు 30 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత కథనం