Amala Paul Files cheating Case: ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ వారాల్లో నిలిచింది. తనను మోసం చేశారంటూ తన మాజీ స్నేహితుడు భవినీందర్ సింగ్ దత్‌పై కేసు నమోదు చేసింది. మోసం, బెదిరింపు కింద తమిళనాడులోని విల్లుపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వ్యాపార ఒప్పందాల్లో భాగంగా తనను మోసం చేశాడని, అంతేకాకుండా తన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి దత్ తనను బెదిరిస్తున్నాడని కేసు పెట్టింది.
హీరోయిన్ ఫిర్యాదు మేరకు విల్లుపురం పోలీసులు భవినిందర్ సింగ్ దత్‌ను అరెస్టు చేశారు. అమలా పాల్ 2018లో దత్‌తో కలిసి చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారని, ఆ ప్రొడక్షన్ కంపెనీని ఆరోవిల్ సమీపంలోని పెరియముదలియార్ చావడికి మార్చారని పోలీసులు మీడియాకు తెలియజేశారు.
ఈ చిత్ర నిర్మాణ సంస్థలో అమలా పాల్ భారీగా పెట్టుబడి పెట్టింది. ఆమె తాజా చిత్రం కడవర్‌ను ఈ బ్యానర్‌లోనే నిర్మించింది. అయితే దత్ నకిలీ పత్రాలను తయారు చేసి ఈ నిర్మాణ సంస్థ డైరెక్టర్ పదవీ నుంచి అమలా పాల్‌ను తొలగించారని పోలీసులు స్పష్టం చేశారు.
అమలా పాల్ ఫిర్యాదు అందుకున్న ఖాకీలు.. భవినీందర్ సింగ్‌పై ఫోర్జరీ, చీటింగ్, బెదిరింపు, వేదింపులతో పాటు పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ విషయంపై అతడిని ప్రశ్నిస్తున్నామనిస, విచారణ చేపట్టామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం