Telangana News Live September 3, 2024: Godavari Floods : ఎగువ నుంచి భారీగా వరద గోదావరి ఉగ్రరూపం- ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత-today telangana news latest updates september 3 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 3, 2024: Godavari Floods : ఎగువ నుంచి భారీగా వరద గోదావరి ఉగ్రరూపం- ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత

Godavari Floods : ఎగువ నుంచి భారీగా వరద గోదావరి ఉగ్రరూపం- ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత

Telangana News Live September 3, 2024: Godavari Floods : ఎగువ నుంచి భారీగా వరద గోదావరి ఉగ్రరూపం- ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత

05:19 PM ISTSep 03, 2024 10:49 PM HT Telugu Desk
  • Share on Facebook
05:19 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 03 Sep 202405:19 PM IST

Telangana News Live: Godavari Floods : ఎగువ నుంచి భారీగా వరద గోదావరి ఉగ్రరూపం- ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత

  • Godavari Floods : ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎస్సారెస్పీ, కడెం, శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202404:03 PM IST

Telangana News Live: Ubit Crypto Scam : యూబిట్ ఆన్లైన్ దందా- కాయిన్స్ వేటలో ఉపాధ్యాయులు!

  • Ubit Crypto Scam : యూబిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలో పలు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బయటపడ్డ యూబిట్ ఆన్లైన్ దందాలో దాదాపు 70 శాతం ఉపాధ్యాయులే ఉండటం గమనార్హం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202412:15 PM IST

Telangana News Live: Donations to CM Relief Fund : తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు.. సీఎంల సహాయనిధికి విరాళాలు.. ఎవరెవరు ఎంత ఇచ్చారో తెలుసా?

  • Donations to CM Relief Fund : తెలుగు రాష్ట్రాలను వరదలు వణికించాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు వరదల్లో కలిసిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో.. ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202411:17 AM IST

Telangana News Live: BRS Mlas Car Attack : ఖమ్మంలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కారుపై దాడి

  • BRS Mlas Car Attack : ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కారుపై దాడి జరిగింది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి ఉన్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202410:50 AM IST

Telangana News Live: Jangaon Accident : జనగామ జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురు ప్రయాణికులు మృతి

  • Jangaon Accident : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురు ప్రయాణికుల ప్రాణం తీసింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోగా.. మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణం విడిచారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202410:01 AM IST

Telangana News Live: Telangana Floods : ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం.. ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • Telangana Floods : తెలంగాణలో భారీ వర్షాలు అపార ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వారిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202409:58 AM IST

Telangana News Live: Khammam Floods : ఖమ్మంలో ఎటు చూసినా క'న్నీళ్లే'

  • Khammam Floods : మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం కన్నీళ్లు పెట్టుకుంది. ఎటుచూసినా వరద ముంపు ప్రాంతాలే కనిపిస్తున్నాయి. వేలాది మంది కట్టుబట్టలతో మిగిలిపోయారు. కనీసం తాగునీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. బురదలో కూరుకుపోయిన ఇండ్లు చూసి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202406:20 AM IST

Telangana News Live: Telangana Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. వరద బాధితుల కోసం ఒకరోజు వేతనం

  • Telangana Employees : తెలంగాణను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు. వరద బాధితులకు సహాయంగా.. ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202405:17 AM IST

Telangana News Live: ములుగు జిల్లాలో చిరుత కలకలం.. మదనపల్లి ఫారెస్ట్‌లో ఆనవాళ్లు

  • ములుగు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని మదనపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పెద్దగా అటవీ ప్రాంతం లేని చోట చిరుత పులి ఆనవాళ్లు కనిపిస్తుండటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202405:03 AM IST

Telangana News Live: బియ్యపు బస్తా విషయంలో గొడవ.. బాలుడిని చంపిన వ్యక్తికి జీవిత కారాగార శిక్ష

  • ఓ వ్యక్తి బియ్యం బస్తా విషయంలో గొడవ పడి, కక్ష పెంచుకుని ఓ బాలుడిని హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో హంతకుడికి జీవిత కాలపు కారాగార శిక్ష పడింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202404:59 AM IST

Telangana News Live: Khammam Floods : శభాష్ సుభాన్.. ప్రాణాలకు తెగించి వరద బాధితులను కాపాడిన జేసీబీ డ్రైవర్

  • Khammam Floods : ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి. అనేక గ్రామాలు వరదల్లోనే నానుతున్నాయి. అటు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో 9 మంది ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్‌పై చిక్కున్నారు. వారిని జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి కాపాడారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202404:42 AM IST

Telangana News Live: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్

  • Transport cutoff: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల ఉధృతికి రోడ్లు తెగిపోయి పలుచోట్ల వంతెనలు కొట్టు కుపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేయడంతో పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తర లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202402:34 AM IST

Telangana News Live: Telangana Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. 21 మందిని బలి తీసుకున్న వరదలు..

  • Telangana Rains : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు.. వాటి వల్ల వచ్చిన వరదలు 21 మందిని బలి తీసుకున్నాయి. భారీగా అస్తి నష్టాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202402:01 AM IST

Telangana News Live: ఏమి కష్టమొచ్చిందో ఏమో... గంటల వ్యవధిలో అన్నాచెల్లెలి ఆత్మహత్య

  • సంవత్సరం క్రితం తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు తండ్రితో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏమి కష్టమొచ్చిందో ఏమో కానీ గంటల వ్యవధిలోనే అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇంధుప్రియాల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202401:54 AM IST

Telangana News Live: పేరెంట్స్ మందలించారని ప్రాణం తీసుకున్న యువకుడు

  • ఇంట్లో డబ్బుల విషయంలో జరిగిన గొడవలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ట్రైన్ కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి