తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 25, 2024: CM Revanth Reddy : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లబ్దిదారులకు అప్పగించండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 25 Sep 202404:08 PM IST
Telangana News Live: CM Revanth Reddy : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లబ్దిదారులకు అప్పగించండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
- CM Revanth Reddy : దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి గరిష్ట సంఖ్యలో పీఎంఏవే ఇళ్లు సాధించాలన్నారు. రాజీవ్ స్వగృహలో నిరుపయోగంగా ఉన్న ఇళ్లు, బ్లాక్ లను వేలం వేయాలన్నారు.
Wed, 25 Sep 202402:24 PM IST
Telangana News Live: Kaleshwaram Saraswathi Pushkaralu : వచ్చే ఏడాది కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు, ఏర్పాట్లకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు
- Kaleshwaram Saraswathi Pushkaralu :వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. దేవాదాయశాఖ పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. కాళేశ్వరం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో రూ.145 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Wed, 25 Sep 202401:46 PM IST
Telangana News Live: Hydra Posts : హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, కొత్తగా 169 మంది సిబ్బంది కేటాయింపు
- Hydra Posts : హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. హైడ్రాకు మొత్తం 169 మంది సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఈ సిబ్బందిని డిప్యుటేషన్ ప్రక్రియలో నియమించుకోవాలని సూచించింది.
Wed, 25 Sep 202412:06 PM IST
Telangana News Live: Hyderabad Rains : హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..! ఉరుములతో కూడిన జల్లుల పడే ఛాన్స్!
- హైదరాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద పారింది. ఇవాళ రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Wed, 25 Sep 202409:10 AM IST
Telangana News Live: Jani Master Police Custody : జానీ మాస్టర్ కి మరో షాక్, నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
- Jani Master Police Custody : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
Wed, 25 Sep 202409:04 AM IST
Telangana News Live: BRS On HYDRA : ‘హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ కు రండి.. న్యాయపరంగా అండగా ఉంటాం’ - కేటీఆర్
- హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా నిలుస్తామని కేటీఆర్ చెప్పారు. హైడ్రా బాధితులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తెలంగాణ భవన్‌కు రావాలని పిలుపునిచ్చారు. వారికి న్యాయపరంగా అండగా నిలుస్తామని తెలిపారు. పార్టీ లీగల్ సెల్ ద్వారా బాధితుల తరపున పోరాడుతామని ప్రకటించారు.
Wed, 25 Sep 202408:27 AM IST
Telangana News Live: Arunachalam Tour : దసరా వేళ 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - తెలంగాణ టూరిజం ఆపరేట్ చేసే ప్యాకేజీ వివరాలివే!
- వచ్చే అక్టోబర్ నెలలో అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం ప్రకటించింది . 4 రోజుల పాటు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్తారు. టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. టూర్ షెడ్యూల్ తెలుసుకోవచ్చు.
Wed, 25 Sep 202408:20 AM IST
Telangana News Live: TG DSC 2008 Jobs: డిఎస్సీ 2008 అభ్యర్థులకు ఎస్జీటీలుగా కాంట్రాక్టు ఉద్యోగాలు.. టీ సర్కార్ కీలక నిర్ణయం
- TG DSC 2008 Jobs: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన 2008 డిఎస్సీ నోటిఫికేషన్‌లో పోస్టింగులు రాక నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిఎస్సీ 2008లో ఉద్యోగాలు రాని వారికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Wed, 25 Sep 202406:52 AM IST
Telangana News Live: Karimnagar District : తల్లిదండ్రుల గొప్ప మనసు..! చనిపోయిన కొడుకు వాటా గ్రామ పంచాయతీకి విరాళం
- కరీంనగర్ జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన కొడుకు భూమి వాటాను గ్రామ పంచాయతీకి అప్పగించారు. కోటి రూపాయల విలువ చేసే ఎకరం ఆరు గుంటల భూమిని విరాళంగా ఇవ్వటంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
Wed, 25 Sep 202406:23 AM IST
Telangana News Live: TG DSC Results 2024 : డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు...? ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏం చేయబోతుంది..?
- TG DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఓవైపు ఫైనల్ కీల పై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో పాటు జనరల్ ర్యాంకింగ్ జాబితా కూడా విడుదల చేసే విషయంలో సందిగ్ధత నెలకొంది. తుది ఫలితాల ప్రకటన మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Wed, 25 Sep 202403:41 AM IST
Telangana News Live: TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 633 ఫార్మాసిస్టు ఖాళీలు భర్తీకి ప్రకటన, ముఖ్య తేదీలివే
- Telangana Pharmacist Notification 2024: తెలంగాణ వైద్యారోగ్య శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. 633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేశారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
Wed, 25 Sep 202403:27 AM IST
Telangana News Live: TG MBBS Counselling: : తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభం,రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు
- TG MBBS Counselling: నీట్ ర్యాంకుల ఆధారంగా తెలంగాణలో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్శిటీ మెరిట్ జాబితాను విడుదల చేసింది. గురువారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోడానికి అనుమతిస్తారు.
Wed, 25 Sep 202401:51 AM IST
Telangana News Live: Duplicate Products: బ్రాండెడ్ ముసుగులో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్‌ల దందా, గుట్టురట్టు చేసిన వరంగల్ టాస్క్ ఫోర్స్
- Duplicate Products: ప్రస్తుత సమాజంలో అసలు వస్తువులకంటే నకిలీలే ఎక్కువైపోయాయి. ఇన్నాళ్లు ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు,సామాన్ల పేరులో అక్షరాలు మార్చి నకిలీవి జనాలకు అంటగట్టే దందా చూశాం. కానీ వరంగల్ నగరంలో మరో కొత్త మోసం బయట పడింది. కరెంట్ వైర్లు, స్విచ్లను కూడా నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు
Wed, 25 Sep 202401:31 AM IST
Telangana News Live: Karimnagar Rains: కరీంనగర్ జిల్లాలో జోరు వానలు.. పిడుగు పాటుకు రైతు మృతి, రైతులకు భారీగా పంట నష్టం
- Karimnagar Rains: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో పిడుగుల వర్షం కురిసింది. పిడుగుపాటు హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో పంట పొలంలోనే రైతు కంకణాల కృష్ణకుమార్ (30) ప్రాణాలు కోల్పోయారు.
Wed, 25 Sep 202401:00 AM IST
Telangana News Live: Warangal Police: కొత్త కారుపై గీతలు, అసభ్య రాతలు..8మంది విద్యార్థులపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు
- Warangal Police: స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల ఆకతాయి చేష్టలతో చిక్కుల్లో పడ్డారు. అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉన్న కొత్త కారుపై గీతలు గీయడంతో, కారు యజమాని కుమార్తెను దూషిస్తూ అసభ్య రాతలు రాయడంతో పోలీస్ కేసు నమోదైంది. ఈ ఘటన వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కలకలం సృష్టించింది.