TG DSC 2008 Jobs: డిఎస్సీ 2008 అభ్యర్థులకు ఎస్జీటీలుగా కాంట్రాక్టు ఉద్యోగాలు.. టీ సర్కార్ కీలక నిర్ణయం-contract jobs as sgts for dsc 2008 candidates t government key decision ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc 2008 Jobs: డిఎస్సీ 2008 అభ్యర్థులకు ఎస్జీటీలుగా కాంట్రాక్టు ఉద్యోగాలు.. టీ సర్కార్ కీలక నిర్ణయం

TG DSC 2008 Jobs: డిఎస్సీ 2008 అభ్యర్థులకు ఎస్జీటీలుగా కాంట్రాక్టు ఉద్యోగాలు.. టీ సర్కార్ కీలక నిర్ణయం

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 25, 2024 01:50 PM IST

TG DSC 2008 Jobs: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన 2008 డిఎస్సీ నోటిఫికేషన్‌లో పోస్టింగులు రాక నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిఎస్సీ 2008లో ఉద్యోగాలు రాని వారికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది.

డిఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు
డిఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు

TG DSC 2008 Jobs: 16ఏళ్ల క్రితం ఉద్యోగ నియామక పరీక్షల్లో కొలువు దక్కక నష్టపోయిన వారికి న‌్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ- 2008లో నష్టపో యిన వారిని కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 2367 మంది ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నారు.ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు రానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 2008 డిఎస్సీ బాధిత అభ్యర్థులున్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి పీలో 2008లో డీఎస్సీ నిర్వహించినపుడు 30 శాతం ఎస్జీటీ పోస్టులను ప్రత్యేకంగా డీఈడీ పూర్తి చేసినవారికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో మార్కుల ద్వారా ముందున్నా బీఈడీ అభ్యర్థులు చివరి నిమిషంలో ప్రభుత్వం 30శాతం డిఇడి విద్యార్ధులకు కోటా ఇవ్వడంతో నష్టపోయారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు అన్యాయం జరిగిందని, తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ నాటి నుంచి వారు పోరాటం చేస్తున్నారు.

న్యాయస్థానాల్లో కూడా బాధితులకు న్యాయం చేయాలని తీర్పునిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 2008లో పోస్టింగ్ దక్కని వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. తాజాగా వారికి కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరికి వేతనంగా నెలకు రూ.31,030 చొప్పున చెల్లిస్తారు.

ఉమ్మడి జిల్లాల ప్రకారం ఈ నియామకాలను చేపడతారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టో బరు 5వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ చేపడతారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌‌సైట్‌లో నియామకాల కోసం కావాల్సిన సర్టిఫికెట్లు, వెరిఫికేషన్ పత్రాలను అందుబాటులో ఉంచారు. నిర్దేశిత ఫార్మాట్్లో పూర్తి వివరాలు నింపి.. కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు సంతకాలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు సూచించింది. ఒరిజినల్ ధ్రువపత్రాల ను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో అందజేయాలని సూచించారు.

ఏఈఈలకు నియామక పత్రాలు రేపే..

తెలంగాణ నీటి పారుదల శాఖ ఉద్యోగ నియామకాలలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు గురువారం సాయంత్రం నియామకపత్రాలు అందజేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఏఈఈలతో పాటు 1800 మంది లస్కర్లకు ఉద్యోగ నియామక పత్రాలను అంద చేస్తారు.

Whats_app_banner