Arunachalam Tour : దసరా వేళ 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - తెలంగాణ టూరిజం ఆపరేట్ చేసే ప్యాకేజీ వివరాలివే!-arunachalam tour package package operated by telangana tourism for october 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Arunachalam Tour : దసరా వేళ 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - తెలంగాణ టూరిజం ఆపరేట్ చేసే ప్యాకేజీ వివరాలివే!

Arunachalam Tour : దసరా వేళ 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - తెలంగాణ టూరిజం ఆపరేట్ చేసే ప్యాకేజీ వివరాలివే!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 25, 2024 01:58 PM IST

వచ్చే అక్టోబర్ నెలలో అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం ప్రకటించింది . 4 రోజుల పాటు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్తారు. టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. టూర్ షెడ్యూల్ తెలుసుకోవచ్చు.

అరుణాచలేశ్వరుడి  ఆలయం
అరుణాచలేశ్వరుడి ఆలయం (image source from @hinduacademy X )

దసరా వేళ అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా అనంతరం అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. వచ్చే అక్టోబర్ నెలలో చూస్తే 14వ తేదీన జర్నీ ఉండనుంది. 12వ తేదీన దసరా పండగ ఉంది. ఈ తేదీ మిస్ అయితే నవంబర్ లో వెళ్లొచ్చు. అందుకు అనుగుణంగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగానూ అరుణాచలేశ్వరుడి దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా తక్కువ ధరలోనే ప్యాకేజీని అందించే ఉద్దేశ్యంతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

  • తెలంగాణ టూరిజం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. ఫస్ట్ డే సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
  • మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
  • మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
  • నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
  • ప్రస్తుతం టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ నుంచి వెళ్తారు.

ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

NOTE : హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=342&journeyDate=2024-08-16&adults=2&childs=0