Jani Master Police Custody : జానీ మాస్టర్ కి మరో షాక్, నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి-rangareddy pocso court orders jani master four days police custody in assistant choreographer case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jani Master Police Custody : జానీ మాస్టర్ కి మరో షాక్, నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

Jani Master Police Custody : జానీ మాస్టర్ కి మరో షాక్, నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

Bandaru Satyaprasad HT Telugu
Sep 25, 2024 02:50 PM IST

Jani Master Police Custody : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

జానీ మాస్టర్ కి మరో షాక్, నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
జానీ మాస్టర్ కి మరో షాక్, నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

Jani Master Police Custody : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టైన జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అంగీకరించింది. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకూడదని, అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. జానీ మాస్టర్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ నెల 28న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ను విచారించనున్నారు. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ అత్యాచారం ఆరోపణలపై జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

పోక్సో కేసు

హైదరాబాద్‌‌లో జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. జానీ మాస్టర్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పీఎస్‌లో ఓ యువతి కంప్లైంట్ ఇచ్చింది. తనపై అత్యాచారం చేశాడని, బెదిరించి గాయపరిచాడని ఆరోపించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు. అవుట్‌ డోర్‌ షూటింగ్ సమయాల్లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది.

గోవాలో అరెస్ట్

నార్సింగిలోనూ తనపై లైంగిక దాడి జరిగిందని యువతి ఫిర్యాదులో పేర్కొంది. 2017లో ఒక టీవీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేరానన్నారు. ఒక షో కోసం జానీ మాస్టర్ తో కలిసి తాను ముంబయికి వెళ్లానని, అక్కడి హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. జానీ మాస్టర్‌ అరెస్ట్‌పై ఇటీవల గోవాలో అరెస్ట్‌ చేశారు. గోవా కోర్టులో హాజరుపర్చి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. జానీపై పోక్సోతో పాటు రేప్‌ కేసులు నమోదు చేశారు.

14 రోజుల రిమాండ్

ఈ కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పరపల్లి పోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో ఉన్నారు. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలనే కొందరు తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీ నిరూపించుకుంటానన్నారు. తనను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టనని జానీ మాస్టర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

సంబంధిత కథనం