Hydra Posts : హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, కొత్తగా 169 మంది సిబ్బంది కేటాయింపు-tg govt created 169 posts for hydra ordered arranged officers from deputation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra Posts : హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, కొత్తగా 169 మంది సిబ్బంది కేటాయింపు

Hydra Posts : హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, కొత్తగా 169 మంది సిబ్బంది కేటాయింపు

Bandaru Satyaprasad HT Telugu
Sep 25, 2024 07:28 PM IST

Hydra Posts : హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. హైడ్రాకు మొత్తం 169 మంది సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఈ సిబ్బందిని డిప్యుటేషన్ ప్రక్రియలో నియమించుకోవాలని సూచించింది.

హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, 169 మంది సిబ్బంది కేటాయింపు
హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, 169 మంది సిబ్బంది కేటాయింపు

Hydra Posts : హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రాకు కొత్తగా వివిధ కేటగిరిలో 169 పోస్టులను క్రియేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు సిబ్బందిని కేటాయించింది. వివిధ కేటగిరీలకు చెందిన 169 పోస్టులను క్రియేట్ చేసింది. వీరిని డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయాలని హైడ్రా కమిషనర్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది.

హైడ్రాకు కొత్త పోస్టులు

1. కమిషనర్ (IAS ర్యాంక్)-1- కేడర్ పోస్ట్

2. అదనపు కమిషనర్ (SP ర్యాంక్)- 1- క్యాడర్ పోస్ట్

3. అదనపు కమిషనర్ (SP ర్యాంక్)- 3 పోస్టులు- రూ.83,100-రూ.1,54,690

4. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 5 పోస్టులు- రూ.58,850-రూ.1,37,050

5. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ -16 పోస్టులు- రూ. 51,320-రూ.1,27,310

6. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్- 16 పోస్టులు -రూ. 42,300-రూ.1,15,270

7.రిజర్వ్ ఇన్స్పెక్టర్-3 పోస్టులు-రూ. 51,320- రూ.1,27,310

8.రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్- 6 పోస్టులు -రూ. 42300-రూ. 115270

9. ఇన్స్పెక్టర్ (కమ్యూనికేషన్స్)- 1 పోస్టు -రూ. 51320-రూ. 127310

10. సబ్ ఇన్‌స్పెక్టర్ (కమ్యూనికేషన్స్)- 2 పోస్టులు-రూ. 42300-రూ. 115270

11. పోలీస్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్స్)- 2 పోస్టులు-రూ. 24280-రూ. 72850

12. పోలీస్ కానిస్టేబుల్- 60 పోస్టులు-రూ. 24280-రూ. 72850

13. అనలిటికల్ ఆఫీసర్- 1 పోస్టు -రూ. 54220-రూ. 133630

14. డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్- 1 పోస్టు-రూ. 45960-రూ. 124150

15. అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్- 2 పోస్టులు -రూ. 42300-రూ. 115270

16 .ప్రాంతీయ అగ్నిమాపక అధికారి- 1 పోస్టు -రూ. 72850-రూ. 147310

17 .అదనపు జిల్లా అగ్నిమాపక అధికారి- 1 పోస్టు- రూ. 45960-రూ. 124150

18. స్టేషన్ ఫైర్ ఆఫీసర్- 12 పోస్టులు- రూ. 38890-రూ. 112510

19. సిటీ ప్లానర్- 1 పోస్టు-రూ. 83100-రూ.154690

20. డిప్యూటీ సిటీ ప్లానర్- 3 పోస్టులు-రూ. 67300-రూ. 143890

21. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (Irr) - 1 పోస్టు- రూ.72850-రూ.147310

22. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Irr)- 3 పోస్టులు-రూ. 621 10-రూ. 140470

23. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (PH) -2 పోస్టులు -రూ. 621 10-రూ. 140470

24. అసిస్టెంట్ ఇంజినీర్ (PH)- 10 పోస్టులు -రూ. 45960-రూ. 12415 0

25. డిప్యూటీ సెక్రటరీ (ఆర్థిక శాఖ)-1 పోస్టు-రూ. 89780-రూ. 154690

26. డిప్యూటీ కలెక్టర్- 1 పోస్టు- రూ. 58850-రూ. 137050

27. ఎమ్మార్వో/ తహశీల్దార్ -3 పోస్టులు- రూ.51320-రూ. 127310

28. సర్వేయర్- 3 పోస్టులు- రూ. 35720-రూ. 104430

29. ఎస్ఆర్వో-1 పోస్టు- రూ. 45960-రూ.124150

30. సూపరింటెండెంట్- 3 పోస్టులు- రూ. 42300-రూ. 115270

31. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్- 1 పోస్టు- రూ. 45960-రూ. 124150

32. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్- 1 పోస్టు- రూ. 51320-రూ. 127310

33. సైంటిస్ట్ (PCB)- 1 పోస్టు- రూ. 62110-రూ. 140470

సంబంధిత కథనం