TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 633 ఫార్మాసిస్టు ఖాళీల భర్తీకి ప్రకటన, ముఖ్య తేదీలివే-notification issued for filling up 633 pharmacist grade 2 posts in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 633 ఫార్మాసిస్టు ఖాళీల భర్తీకి ప్రకటన, ముఖ్య తేదీలివే

TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 633 ఫార్మాసిస్టు ఖాళీల భర్తీకి ప్రకటన, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 25, 2024 09:36 AM IST

Telangana Pharmacist Notification 2024: తెలంగాణ వైద్యారోగ్య శాఖ నుంచి నోటిఫికేషన్‌ జారీ అయింది. 633 ఫార్మాసిస్టు గ్రేడ్‌ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేశారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

633 ఫార్మాసిస్టు గ్రేడ్‌ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
633 ఫార్మాసిస్టు గ్రేడ్‌ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇటీవలనే 2050 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రకటన రాగా… తాజాగా 633 ఫార్మాసిస్టు గ్రేడ్‌ 2 పోస్టులను భర్తీకి ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి అక్టోబర్ 05వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు మంగళవారం పూర్తి వివరాలను ప్రకటించారు.

ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబరు 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు నవంబర్ 30వ తేదీన జరుగుతాయి. https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్‌ కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫార్మసీ పూర్తి చేయటంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు.

ముఖ్య తేదీలు :

  • ఆన్ లైన్ దరఖాస్తులు - 05 అక్టోబర్ , 2024.
  • దరఖాస్తులకు తుది గడువు - 21, అక్టోబర్ , 2024.
  • దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ - అక్టోబర్ 23, 24
  • రాత పరీక్షలు - 11 నవంబర్ , 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://mhsrb.telangana.gov.in/ 

ఇటీవలే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ప్రకటన:

ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం  2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్)ల నియామకంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ మెడికల్ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 పోస్టులను భర్తీ చేయనున్నారు .

తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుష్ శాఖలో 61 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 నర్సింగ్ ఆఫీసర్ ను భర్తీ చేయనున్నారు. ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

  • ఆన్‌లైన్ అప్లికేషన్లు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం అవుతాయి. 
  • ఆన్‌లైన్ దరఖాస్తులను అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించారు. 
  • అభ్యర్థులు తమ అప్లికేషన్లను అక్టోబర్ 16 ఉదయం 10.30 నుంచి 17వ తేదీ సాయంత్ర 5.00 వరకు సవరించుకోవచ్చు. 
  • సీబీటీ విధానంలో పరీక్షను నవంబర్ 17, 2024 నిర్వహిస్తారు.
  • అర్హులైన అభ్యర్థు బోర్డు వెబ్‌సైట్‌ https://mhsrb.telangana.gov.in  దరఖాస్తు చేసుకోవచ్చు.