Telangana News Live October 4, 2024: Karimnagar District : ఘోర అగ్నిప్రమాదం - ఏడేళ్ళ బాలుడు సజీవదహనం-today telangana news latest updates october 4 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 4, 2024: Karimnagar District : ఘోర అగ్నిప్రమాదం - ఏడేళ్ళ బాలుడు సజీవదహనం

Karimnagar District : ఘోర అగ్నిప్రమాదం - ఏడేళ్ళ బాలుడు సజీవదహనం

Telangana News Live October 4, 2024: Karimnagar District : ఘోర అగ్నిప్రమాదం - ఏడేళ్ళ బాలుడు సజీవదహనం

05:13 PM ISTOct 04, 2024 10:43 PM HT Telugu Desk
  • Share on Facebook
05:13 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 04 Oct 202405:13 PM IST

Telangana News Live: Karimnagar District : ఘోర అగ్నిప్రమాదం - ఏడేళ్ళ బాలుడు సజీవదహనం

  • కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ళ బాలుడు సజీవ దహనమయ్యాడు.కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావటంతో ఈ ప్రమాదం జరిగింది. కళ్ల ముందే కన్న కొడుకు మంటల్లో కాలిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202402:57 PM IST

Telangana News Live: TOSS Admissions 2024 : ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు - ఆన్ లైన్ అప్లికేషన్ల గడువు పొడిగింపు

  • Telangana Open School Society: ఈ విద్యా సంవత్సరానికి సంబధించిన టెన్త్, ఇంటర్‌లో చేరడానికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ గడువు ఇటీవలే ముగియటంతో… అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202401:18 PM IST

Telangana News Live: Mahabubabad News : పంచాయతీ కార్యాలయంలోనే సెక్రటరీ సూసైడ్ అటెంప్ట్ - కలెక్టర్ కు లేఖ..!

  • మహబూబాబాద్ జిల్లాలో మహిళా పంచాయతీ సెక్రటరీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తితో పాటు పలువురు అధికారుల వేధింపులే కారణమంటూ జిల్లా కలెక్టర్ కు సూసైడ్ లెటర్ కూడా రాసింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202412:34 PM IST

Telangana News Live: Musi Row : మూసీ నది ప్రక్షాళన.. ఒక్కటవుతున్న ఉమ్మడి నల్గొండ రైతులు

  • Musi Row : మూసీ నది ప్రక్షాళనకు ఉమ్మడి నల్గొండ రైతులు ఒక్కటవుతున్నారు. హైదరాబాద్ నాగోల్‌లో శనివారం రైతులు సమావేశం కానున్నారు. ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు రైతులు సై అంటున్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొడతామని ఇటు కాంగ్రెస్ నాయకత్వం అంటోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202412:25 PM IST

Telangana News Live: TG Rythu Bharosa : ముగిసిన వానాకాలం సీజన్..! అన్నదాతకు అందని పెట్టుబడి సాయం

  • TG Govt Rythu Bharosa Scheme :  వానాకాలం వ్యవసాయ సీజన్ ముగిసింది. అయినప్పటికీ రైతులకు పంట పెట్టుబడి సాయం రాలేదు. రైతు భరోసాపై సర్కార్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన కూడా రాలేదు. సర్కార్ నుంచి నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202411:55 AM IST

Telangana News Live: TGPSC Group 1 Mains : ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు - త్వరలోనే హాల్ టికెట్లు

  • TGPSC Group 1 Mains Exams 2024 : తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 27వ తేదీతో పూర్తి అవుతాయని TGPSC ప్రకటించింది.శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్స్ ను కూడా వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202411:08 AM IST

Telangana News Live: Medak District : చేతబడి నెపంతో మహిళపై దాడి - పెట్రోల్​ పోసి సజీవ దహనం

  • మెదక్ లో దారుణం వెలుగు చూసింది. చేతబడి నెపంతో ఓ మహిళను దారుణంగా కొట్టారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202410:37 AM IST

Telangana News Live: BRS Harish Rao : రుణమాఫీ అమలు కోసం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం - హరీశ్ రావ్

  • రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణమాఫీ అమలు కోసం దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202409:23 AM IST

Telangana News Live: KVP Letter to Revanth Reddy : నా ఫామ్‌హౌజ్‌ను నేనే కూలుస్తా.. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేవీపీ

  • KVP Letter to Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్‌ పార్టీ నేతగా ఎలాంటి మినహాయింపులు వద్దని స్పష్టం చేశారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. ఎవరూ కలుగచేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనిద్దామన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202408:52 AM IST

Telangana News Live: Nagarjuna Sagar : ఎంత దారుణం.. మహిళను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు!

  • Nagarjuna Sagar : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపేసిన నిందితులు.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనిపై మృతురాలి బంధువులు గట్టిగా పోరాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూ ఇప్పుడు నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202408:28 AM IST

Telangana News Live: TG Staff Recruitment 2024 : స్టాఫ్ నర్స్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - రాత పరీక్ష తేదీ మార్పు, వివరాలివే

  • TG Staff Nurse Notification Updates : తెలంగాణ సర్కార్ 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష తేదీకి సంబంధించి అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 17వ తేదీ కాకుండా…23వ తేదీన ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202407:37 AM IST

Telangana News Live: Siddipet Boy Death: సిద్దిపేటలో విషాదం..నీటి సంపులో పడికుమారుడు మృతి, భోరున విలపిస్తున్న తల్లితండ్రులు

  • Siddipet Boy Death:మూడు సంవత్సరాల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్ళి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కమ్మర్లపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లితండ్రులు భోరున విలపిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202407:12 AM IST

Telangana News Live: PonnamPrabhakar: ప్రభుత్వ పథకాలన్నింటికి ప్రామాణికంగా డిజిటల్ కార్డు, కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం

  • PonnamPrabhakar: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ప్రామాణికంగా, బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా రూపొందించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీ చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో  మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202406:57 AM IST

Telangana News Live: TG Panchayat Secretaries : చేతిలో చిల్లిగవ్వ లేదు.. బతుకమ్మ పండుగను ఎలా నిర్వహించాలి.. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన

  • TG Panchayat Secretaries : బతుకమ్మ, దసరా.. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండగలు. గ్రామాల్లో ఈ పండగలకు ప్రాధాన్యత ఎక్కువ. వీటిని నిర్వహించడానికి ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు రావడం లేదని.. చేతిలో చిల్లిగవ్వ లేదని వాపోతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202406:55 AM IST

Telangana News Live: Janagama Gangrape: సంరక్షణ గృహంలో ఉండలేక పారిపోతే కాటేశారు.. జనగామలో బాలికలపై దారుణం

  • Janagama Gangrape: జనగామలో ఇద్దరు బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారు. ఆశ్రయ గృహం నుంచి పరారైన బాలికలపై కన్నేసిన యువకులు  వారిపై అకృత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202405:43 AM IST

Telangana News Live: TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం

  • TGPSC : టీజీపీఎస్సీ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు కనీసం 150 ప్రశ్నలు తయారు చేయలేకపోతున్నారని.. ఇక కమిషన్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తాజాగా.. ఇదే అంశంపై కమిషన్ కార్యాలయం ఎదుట పోస్టర్లు అంటించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202401:43 AM IST

Telangana News Live: Secunderabad Goa Train: గోవాకు డైరెక్ట్‌ రైలు వచ్చేసింది..శనివారం నుంచి ప్రారంభం.. 9నుంచి అందుబాటులోకి సేవలు

  • Secunderabad Goa Train: పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైలు వచ్చేసింది. సికింద్రాబాద్‌ నుంచి గోవాకు డైరెక్ట్ ట్రైన్ సర్వీసులు అక్టోబర్‌ 9 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 6న ప్రయోగాత్మకంగా గోవా ట్రైన్‌ ప్రారంభిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202401:22 AM IST

Telangana News Live: Karimnagar Dasara: వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశక్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

  • Karimnagar Dasara: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాశక్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేలాదిమంది భక్తులు భవాని దీక్షలు తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుపెన్నడు లేని విధంగా ఈసారి మహిళా భక్తులు పెద్దసంఖ్యలో భవాని దీక్ష బూనారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 04 Oct 202411:35 PM IST

Telangana News Live: Konda Surekha Episode : గులాబీ నేతల వ్యూహాత్మక మౌనం.. బీఆర్ఎస్‌కు పొలిటికల్ మైలేజ్.. కాంగ్రెస్‌కు డ్యామేజ్!

  • Konda Surekha Episode : ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా కొండా సురేఖ చుట్టూ తిరుగుతోంది. ఇటు కాంగ్రెస్.. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నా.. బీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది. దీంతో బీఆర్ఎస్‌కు పొలిటికల్ మైలేజ్.. కాంగ్రెస్‌కు డ్యామేజ్ అనే చర్చ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి