TGPSC Group 1 Mains : ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు - త్వరలోనే హాల్ టికెట్లు-tgpsc group 1 mains exams from 21st to 27th october 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Mains : ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు - త్వరలోనే హాల్ టికెట్లు

TGPSC Group 1 Mains : ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు - త్వరలోనే హాల్ టికెట్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 04, 2024 05:25 PM IST

TGPSC Group 1 Mains Exams 2024 : తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 27వ తేదీతో పూర్తి అవుతాయని TGPSC ప్రకటించింది.శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్స్ ను కూడా వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. 27వ తేదీతో ముగుస్తాయని వెల్లడించింది. అభ్యర్థులుకు ముందస్తు అవగాహన కోసం శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్లను వెబ్ సైట్ లో ఉంచింది.

ఇక త్వరలోనే హాల్ టికెట్లను కూడా విడుదల చేయనుంది. పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది.

ఆందోళనలో అభ్యర్థులు..!

మరోవైపు గ్రూప్‌-1 మెయిన్స్‌పై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రిలిమ్స్ ఫలితాలపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు పదికి పైగా పిటిషిన్లు దాఖలైనట్లు తెలిసింది. ఇందులో ప్రాథమిక కీతో పాటు పాత, కొత్త నోటిఫికేషన్ల అంశం, స్పోర్ట్సో కోటాతో పాటు ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల వంటి అంశాలు ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ పూర్తి చేసిన తర్వాత కోర్టు తీర్పులు ప్రతికూలంగా వస్తే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వహించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే రెండు సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దు కావటంతో అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులు వస్తే ఏంటని ఆందోళన చెందుతున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. మెయిన్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. జూన్‌ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత… ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించారు.

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు నిర్వహిస్తారు.

గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ :

  • జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21, 2024.
  • పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.
  • పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23, 2024.
  • పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24, 2024.
  • పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25, 2024.
  • పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26, 2024.
  • పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27, 2024.

మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం