YS Sharmila : గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయండి, సీఎం చంద్రబాబును కోరిన షర్మిల-apcc president ys sharmila letter to cm chandrababu on group 1 mains ratio increase ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila : గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయండి, సీఎం చంద్రబాబును కోరిన షర్మిల

YS Sharmila : గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయండి, సీఎం చంద్రబాబును కోరిన షర్మిల

Bandaru Satyaprasad HT Telugu
Aug 18, 2024 06:09 PM IST

YS Sharmila On Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఏపీపీఎస్సీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గ్రూప్-1 అభ్యర్థులు వైఎస్ షర్మిలకు లేఖ రాశారు. ఈ విషయాన్ని షర్మిల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయండి, సీఎం చంద్రబాబును కోరిన షర్మిల
గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయండి, సీఎం చంద్రబాబును కోరిన షర్మిల

YS Sharmila On Group 1 Mains : గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును అభ్యర్థించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల పక్షాన మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామన్నారు. గ్రూప్2, డిప్యూటీ DEO పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించినట్లే, గ్రూప్-1 మెయిన్స్ కి సైతం 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం, కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడం, గ్రూప్‌-1 సిలబస్‌ను రివిజన్‌ చేయలేకపోవడం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం లాంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారన్నారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుందన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు తనకు రాసిన లేఖలను జోడిస్తూ షర్మిల ట్వీట్ చేశారు.

వైఎస్ షర్మిలకు గ్రూప్-1 అభ్యర్థులు లేఖ

గ్రూప్-1 అభ్యర్థులు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ మార్చి 17,2024 నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యామని అభ్యర్థులు లేఖలో తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు 1:50 నిష్పత్తి విధానం అనుసరిస్తున్నప్పటికీ, కమిషన్ ఈ విషయాన్ని మరోసారి పరిగణించాలని మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయమని అభ్యర్థిస్తున్నామన్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవో 5 అభ్యర్థుల నిష్పత్తి పూర్తిగా కమిషన్ విచక్షణాధికారం అని గుర్తుచేశారు. ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్-2, డిప్యూటీ డీఈవో పరీక్షలలో 1:100 నిష్పత్తిని అనుసరించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు కమిషన్ సుమారు 92,000 మంది అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు కేవలం 4000 మందిని మాత్రమే ఎంపిక చేసింది.

గ్రూప్-1 మెయిన్స్ 1:100 నిష్పత్తి ఎందుకంటే?

ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ గతేడాది సెప్టెంబర్ 19న నిర్వహించిన మీడియా సమావేశంలో రాబోయే నోటిఫికేషన్ కోసం సిలబస్, నమూనా మార్పును ప్రకటించారు. కొత్త నమూనా వివరాలను విడుదల చేశారు. కానీ అకస్మాత్తుగా ఏపీపీఎస్సీ పాత సిలబస్, నమూనాతో నోటిఫికేషన్ ను విడుదల చేయడంతో అభ్యర్థులు పరీక్షకు సిద్ధం అవ్వడానికి తగిన సమయం ఇవ్వలేదు. అనేక ఇంగ్లీష్-తెలుగు అనువాద పొరపాట్లతో తెలుగు మీడియం గ్రామీణ నేపథ్య అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతో పోలిస్తే ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు.

గ్రూప్-1 పోస్టుల సంఖ్య 89 మాత్రమే, గత 4 నోటిఫికేషన్లలో గ్రూప్-1 పోస్టులతో పోలిస్తే ఇది చాలా తక్కువ, గ్రూప్ 2 పోస్టుల (905 పోస్టులు) కంటే చాలా తక్కువ. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల మధ్య చాలా తక్కువ టైం గ్యాప్ ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల మధ్య టైం గ్యాప్ కేవలం 3 వారాలే ఉండడం, ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొత్తం సిలబస్ కవర్ చేసి, పునఃసమీక్షించడానికి సరిపడిన సమయం కాకపోవడంతో.. కమిషన్ ను మరింత సమయం అడిగామని, కానీ వారు పరిగణించలేదని అభ్యర్థులు లేఖలో రాశారు. గత గ్రూప్-1 పరీక్షలతో పోలిస్తే రెండు పేపర్లు కఠినంగా ఉన్నాయన్నారు.

సివిల్ సర్వీసెస్ లో జనరల్ అప్టిట్యూడ్ విభాగం మొత్తం మార్కుల 33 శాతంతో అర్హత సాధించే విధానం ఉంటుంది. మెయిన్స్ పరీక్షకు జనరల్ స్టడీస్ పేపర్ లో సాధించిన మార్కులను మాత్రమే పరిగణిస్తారు. అయితే, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్ తో పాటు జనరల్ అప్టిట్యూడ్ విభాగంలో సాధించిన మార్కులను పరిగణిస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల, గణితం, తెలుగు మీడియం నేపథ్య అభ్యర్థులపై ప్రభావితం చూపుతుంది. ఈ నేపథ్యంలో మా న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నామని షర్మిలకు గ్రూప్-1 అభ్యర్థులు లేఖ రాశారు.

సంబంధిత కథనం