APPSC Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త షెడ్యూల్-appsc postpone group 1 mains exam soon new schedule released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త షెడ్యూల్

APPSC Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త షెడ్యూల్

Bandaru Satyaprasad HT Telugu
Aug 21, 2024 10:53 PM IST

APPSC Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పడింది. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్ ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 81 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలై సంగతి తెలిసిందే.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త షెడ్యూల్
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త షెడ్యూల్

APPSC Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎఎస్సీ ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 17న ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా... 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే గ్రూప్-2 తరహాలో గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఏప్రిల్‌ 12 విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన గ్రూప్ -1 నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 81 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది ఏపీపీఎస్సీ. సెప్టెంబర్ నెలల మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు ముందుగా నిర్ణయించినా...తాజాగా మెయిన్స్ వాయిదా వేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది.

ఏపీ గ్రూప్ 1 ఖాళీల వివరాలు

  • డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-9
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌-18
  • డీఎస్పీ (సివిల్‌)- 26
  • రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌-6
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు-5
  • జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌- 4
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌- 2
  • జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌- 1
  • జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II-1
  • ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌- 1

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా విధానం

గ్రూప్-1 మెయిన్స్ లో రెండు క్వాలిఫైయింగ్ పేపర్లతో పాటు ఐదు మెరిట్ ర్యాంకింగ్ పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారే మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్ లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇది 150 మార్కులకు నిర్వహిస్తారు. మరో పేపర్ తెలుగు ఉంటుంది. ఇది కూడా 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్లుగా పరిగణిస్తారు.

ఇక మెయిన్స్ లో చూస్తే పేపర్ 1 జనరల్ ఎస్సేలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. భారత దేశ చరిత్రకు సంబంధించి రెండో పేపర్ ఉంటుంది. దీనికి 150 మార్కులు కేటాయించారు. భారత రాజ్యంగం, గవర్నెర్స్ అని మూడో పేపర్ ఉంటుంది. దీనికి 150 మార్కులు కేటాయించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాల్గో పేపర్ ఉండగా.. దీనికి కూడా 150 మార్కులు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదో పేపర్ గా ఉండగా.. దీనికి కూడా 150 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్ , తెలుగు పేపర్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మిగతా ఐదు పేపర్లలో నుంచి మెరిట్ ను తీసుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం