TGPSC Group 1 Mains : గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్... మెయిన్స్ పరీక్షల సమయంలో స్వల్ప మార్పు, తాజా ప్రకటన ఇదే
TGPSC Group 1 Mains 2024 : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ(TGPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్ష సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది. మధ్యాహ్యం 2.30 గంటలకు కాకుండా… అరగంట ముందుగానే ఎగ్జామ్స్ మొదలుకానున్నాయి.
TGPSC Group 1 Mains : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబరు 21వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. అక్టోబరు 27వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయని టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా జూన్ నెలలోనే విడుదల చేసింది. తాజాగా మెయిన్స్ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్ష సమయాల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మెయిన్స్ పరీక్షలు మధ్యాహ్యం 2.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంటుంది. 5.30 గంటలకు పూర్తి అవుతుంది. ఇందులో స్వల్ప మార్పులు చేసింది టీజీపీఎస్సీ. మధ్యాహ్నం 2 గంటలకే పరీక్ష ప్రారంభం అవుతుందని తాజా ప్రకటనలో పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు పూర్తి అవుతుందని వెల్లడించింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరింది.
గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రిలిమ్స్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత… ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించారు.
అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు నిర్వహిస్తారు.
షెడ్యూల్ :
- జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21, 2024.
- పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.
- పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23, 2024.
- పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24, 2024.
- పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25, 2024.
- పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26, 2024.
- పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27, 2024.
మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 06 పేపర్లు ఉంటాయి. వీటిని అభ్యర్థి ముందుగా ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది.
పేపర్‌లో కొంత భాగాన్ని ఇతర భాషలో రాయడానికి అభ్యర్థికి అనుమతి లేదు. ఇంగ్లిష్ లో కొంత భాగం, తెలుగు లేదా ఉర్దూలో మిగిలిన భాగం రాయడానికి అనుమతి లేదని టీజీపీఎస్సీ గతంలోనే ప్రకటించింది. తాజాగా అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా ప్రకటించింది.