Janagama Gangrape: సంరక్షణ గృహంలో ఉండలేక పారిపోతే కాటేశారు.. జనగామలో బాలికలపై దారుణం-unable to stay in a shelter home girls ran away and was gangraped ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Janagama Gangrape: సంరక్షణ గృహంలో ఉండలేక పారిపోతే కాటేశారు.. జనగామలో బాలికలపై దారుణం

Janagama Gangrape: సంరక్షణ గృహంలో ఉండలేక పారిపోతే కాటేశారు.. జనగామలో బాలికలపై దారుణం

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 04, 2024 12:25 PM IST

Janagama Gangrape: జనగామలో ఇద్దరు బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారు. ఆశ్రయ గృహం నుంచి పరారైన బాలికలపై కన్నేసిన యువకులు వారిపై అకృత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేసి పోక్సో కేసు నమోదు చేశారు.

జనగామలో మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్
జనగామలో మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్

Janagama Gangrape: హైదరాబాద్‌లోని సంరక్షణ గృహంలో ఆశ్రయం పొందుతున్న బాలికలు అక్కడ ఇమడలేక బయటకు పారిపోయారు. జనగామ చేరుకున్న పరిచయం ఉన్న వారికి ఫోన్‌ చేయడంతో వారిని తీసుకెళ్లిన యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్‌ ఐఎస్ సదన్ పరిధిలో బాలికల కోసం ప్రైవేటు సంస్థ నిర్వహణలో పునరావాస కేంద్రం నడుస్తోంది. జనగామకు పద్నాలుగేళ్ల బాలిక మూడు నెలలుగా ఇక్కడ ఉంటోంది. మల్కాజిగిరికి చెందిన పదిహేనేళ్ల మరో బాలిక సెప్టెంబరు 18 నుంచి ఆశ్రయం పొందుతోంది. వీరిద్దదరికి తల్లిదండ్రులున్నా కుటుంబ సమస్యల నేపథ్యంలో వారిని హాస్టల్లో చేర్పించారు. సంరక్షణ గృహంలో బాలికల మధ్య స్నేహం పెరిగి అక్కడి నుంచి పారిపోవాలనుకున్నారు. సెప్టెంబరు 24న కిటికీ నుంచి బయటకు దూకి పారిపోయారు.

ఈ ఘటనపై హాస్టల్‌ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో సైదాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. 24వ తేదీ రాత్రి 8 గంటలకు బాలికలు జనగామ చేరుకున్నారు. బాలికల్లో ఒకరు బస్టాండ్ సమీపంలో ఉన్న పాన్‌షాప్‌ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని తనకు పరిచయం ఉన్న నాగరాజుకు ఫోన్ చేసింది. అక్కడకు వచ్చిన అతడు వారికి ఆశ్రయం కల్పిస్తానని తనతో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బస్టాండు దగ్గరే మరో బాలిక ఒంటరిగా ఉండి పోవడాన్ని గమనించిన పాన్‌షాప్‌ యజమాని సాయిదీప్ ఆశ్రయం కల్పిస్తానంటూ నమ్మించి పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సాయిదీప్‌తో పాటు బేకరి నిర్వాహకుడు రాజు బాలికపై అత్యాచారం చేశారు. నాగరాజు తీసుకెళ్లిన బాలికను 25వ తేదీ ఉదయం తీసుకొచ్చి బస్టాండు దగ్గర విడిచిపెట్టాడు.

బాలికల గురించి సమాచారం తెలుసుకున్న సాయిదీప్, రాజుల మిత్రులు అఖిల్, రోహిత్‌లు హైదరాబాద్ తీసుకెళ్తామంటూ వారిని కారులో వేర్వేరు ప్రదేశాలకు తిప్పారు. వారిపై లైంగిక దాడికి పాల్పడి తిరిగి బస్టాండ్ దగ్గరే వదిలేశారు. అప్పటికే బాలికల కోసం గాలిస్తున్న పోలీసులకు జనగామ బస్టాండ్ దగ్గర కనిపించడంతో వారినిసైదాబాద్‌ పీఎస్‌కు తీసుకొచ్చారు. అనంతరం పునరావాస కేంద్రం నిర్వాహకులకు అప్పగిం చారు.

సంరక్షణ కేంద్రంలో బాలికలు దిగులుగా కనిపించడంతో వారిని భరోసా కేంద్రం నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. దీంతో వారు తమకు జరిగిన అన్యాయం వివరించారు. సైదాబాద్ పోలీసులు నిందితులైైన ఐదుగురు యువకులను అరెస్ట్‌ చేసి వారిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Whats_app_banner