TOSS Admissions 2024 : ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు - ఆన్ లైన్ అప్లికేషన్ల గడువు పొడిగింపు-telangana open school society admissions 2024 date has been extended up to october 31 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Toss Admissions 2024 : ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు - ఆన్ లైన్ అప్లికేషన్ల గడువు పొడిగింపు

TOSS Admissions 2024 : ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు - ఆన్ లైన్ అప్లికేషన్ల గడువు పొడిగింపు

Telangana Open School Society: ఈ విద్యా సంవత్సరానికి సంబధించిన టెన్త్, ఇంటర్‌లో చేరడానికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ గడువు ఇటీవలే ముగియటంతో… అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించారు.

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు 2024

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (TOSS)లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల గడువు ముగియగా.. అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబర్ 31వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.

వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం టాస్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను(2024-25) 10వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు పొందుతారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు:

మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తుల గడువును కూడా పొడిగించారు. సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగియగా… మరోసారి అధికారులు గడువును పెంచారు. అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ అప్లికేషన్లు చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

  • అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ సైట్ లో వెళ్లి ముందుగా అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  •  కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 
  • క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
  • ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. 
  • మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు.