KTR: మోదీజీ… అలా చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి
ktr on bilkis bano case: బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ సర్కార్ విడుదల చేయటంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూటిగా ప్రశ్నలు సంధించారు.
minister ktr questions to pm modi: సంచలనం రేపిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను విడుదల చేయటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 11 మంది దోషులను ప్రభుత్వం విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిషన్ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
మహిళల గురించి మీరు మాట్లాదేది నిజమైతే... రెమిషన్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఉత్తర్వులను రద్దు చేయించి.. దేశం పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మీ జోక్యం చేసుకుని చిత్తశుద్ధి చూపించాల్సిన అవసరం ఉంది అని రాసుకొచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లో తగిన సవరణలు చేసి రేపిస్టులకు బెయిల్ రాకుండా చేయాలని పేర్కొన్నారు.

ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్ జరిగింది. 2002 జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనైమంది. సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబానికి సంబంధించిన ఏడుగురిని చంపేశారు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరినీ గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం విడుదల చేసింది. 1992 నాటి రెమిషన్ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టాపిక్