TGPSC Group 1 Hall Tickets : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-hyderabad telangana group 1 prelims hall tickets released download for tspsc website ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Hall Tickets : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TGPSC Group 1 Hall Tickets : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Jun 01, 2024 02:51 PM IST

TGPSC Group 1 Hall Tickets : టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TGPSC Group 1 Hall Tickets : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ల డౌన్ లోడ్ ఇలా?

  • Step 1 : అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయండి.
  • Step 2 : హోమ్ పేజీలో గ్రూప్-1 ప్రిలిమ్స్ డౌన్ లోడ్ హాల్ టికెట్లు ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Step 3 : ఆ తర్వాత పేజీలో టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చా వివరాలు నమోదు చేయండి.
  • Step 4 : ఆ తర్వాత డౌన్ లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేయండి.
  • Step 5 : అభ్యర్థి హాల్ టికెట్లు డౌన్ లోడ్ అవుతుంది. హాల్ టికెట్ ఓపెన్ చేసి వివరాలు చెక్ చేసుకోండి.

జూన్ 9న ప్రిలిమ్స్

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ కు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ కు సంబంధించి హాల్ టికెట్లను అధికారులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష జరుగుతుంది.

ఆఫ్ లైన్ లోనే పరీక్ష నిర్వహణ

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌(OMR) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్‌-1కు(Group- 1 Prelims)కు 4.03 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. దీంతో పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

గ్రూప్-1 పరీక్షా విధానం

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్, రెండో దశలో మెయిన్స్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. ప్రిలిమ్స్ కు హాజరైన అభ్యర్థులను లెక్కలోకి తీసుకుని నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు నిర్ణయిస్తారు. రెండో దశలో మెయిన్స్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షను 2.30 గంటల సమయంలో నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్ష విధానం

గ్రూప్-1 మెయిన్స్ ను పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయిస్తారు. ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్‌ ఇంగ్లిష్‌ అర్హత పేపర్‌గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయిస్తారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం