TGPSC Group 1 Hall Tickets : టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ అప్డేట్, జూన్ 1న హాల్ టికెట్లు విడుదల-hyderabad tgpsc group 1 prelims hall tickets released on june 1st 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Hall Tickets : టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ అప్డేట్, జూన్ 1న హాల్ టికెట్లు విడుదల

TGPSC Group 1 Hall Tickets : టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ అప్డేట్, జూన్ 1న హాల్ టికెట్లు విడుదల

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2024 09:14 PM IST

TGPSC Group 1 Hall Tickets : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. జూన్ 1న గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ అప్డేట్, జూన్ 1న హాల్ టికెట్లు విడుదల
టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ అప్డేట్, జూన్ 1న హాల్ టికెట్లు విడుదల

TGPSC Group 1 Hall Tickets : టీజీపీఎస్సీ(TGPSC) గ్రూప్ -1 ప్రిలిమ్స్ పై అప్డేట్ వచ్చింది. జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 9వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యహ్నం 1 గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సర్వం సిద్ధమవుతోంది. జూన్ 9న నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో పేపర్ల లీకేజీ నేపథ్యంలో ఏ చిన్న తప్పునకు అవకాశం ఇవ్వొద్దని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి మరికొన్ని పోస్టులను కలిపి ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా జూన్‌ 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది.

జూన్ 1 నుంచి హాల్ టికెట్లు

గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ల విడుదలపై తాజాగా టీజీపీఎస్సీ ప్రకటన చేసింది. జూన్ 1వ తేదీ మధ్యాహ్న 2 గంటల నుంచి కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. తెలంగాణ గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభం కాగా మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జూన్ 9న ప్రిలిమ్స్ , అక్టోబరు 21న నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది.

గ్రూప్ -1 పరీక్షా విధానం

గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు రెండు దశల్లో పరీక్షలు రాయాలి. మొదటగా ప్రిలిమ్స్, రెండో దశలో మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు. ప్రిలిమ్స్ లో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందిన వారికి మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. రెండో దశలో నిర్వహించే మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయిస్తారు. ఈ ఆరు పేపర్లకు అదనంగా జనరల్‌ ఇంగ్లిష్‌ అర్హత పేపర్‌గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయిస్తారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌(OMR) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్‌-1కు 4.03 లక్షల అప్లికేషన్లు రావటంతో పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.

Whats_app_banner

సంబంధిత కథనం