TSPSC Group 1 Exam 2024 : జూన్ 9న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ - 1వ తేదీన హాల్ టికెట్లు విడుదల-telangana group 1 prelims hall tickets 2024 can be downloaded from june 1 latest updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 1 Exam 2024 : జూన్ 9న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ - 1వ తేదీన హాల్ టికెట్లు విడుదల

TSPSC Group 1 Exam 2024 : జూన్ 9న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ - 1వ తేదీన హాల్ టికెట్లు విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
May 25, 2024 05:35 AM IST

TSPSC Group 1 Prelims 2024 Updates : తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9వ తేదీన జరగనుంది. అయితే హాల్ టికెట్ల విడుదలపై టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024

TS Group 1 Prelims Hall Tickets 2024 : తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సర్వం సిద్ధమవుతోంది. జూన్ 9వ తేదీన నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష కోసం…. టీఎస్పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఏ చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వొద్దని భావిస్తోంది.

జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష….

తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం కొద్దిరోజుల కిందట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి… మరికొన్ని పోస్టులను కలిపి ఈ ప్రకటన ఇచ్చింది. ఇందులో భాగంగా…. జూన్‌ 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది.

జూన్ 1 నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు….

ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ల విడుదలపై టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి అభ్యర్థులు కమిషన్ వెబ్ సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. మార్చి 14వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ టీఎస్పీఎస్సీ మరో రెండు పొడిగించింది. దీంతో మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది.ఈనోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ(TSPSC). అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది కమిషన్.

TSPSC Group 1 Exam 2024: పరీక్షా విధానం:

గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు మొదటగా ప్రిలిమ్స్ రాయాలి. రెండో దశలో మెయిన్స్ ఉంటుంది.

1. ప్రిలిమినరీ ఎగ్జామ్‌

2. మెయిన్‌ ఎగ్జామినేషన్

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. హాజరైన అభ్యర్థులను లెక్కలోకి తీసుకొని నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందిన వారికి.. రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది.

ఇక 2వ దశలో నిర్వహించే మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయించారు. ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్‌ ఇంగ్లీష్‌ అర్హత పేపర్‌గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయిస్తారు.

ఆఫ్ లైన్ పద్ధతిలోనే పరీక్ష…..

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సీబీఆర్‌టీ విధానంలో కాకుండా…. ఓఎంఆర్‌(OMR) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్‌-1కు(Group 1 Preliminary Exam Applications) భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 4.03 లక్షల అప్లికేషన్లు రావటంతో…. పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ ఇటీవలేనే నిర్ణయం తీసుకుంది.

కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని అంచనా వేసింది. దీంతో… ఈసారి జరగబోయే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ బేస్డ్‌ ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది.

NOTE : https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులు ప్రిలిమ్స్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం