TS EAPCET Counselling 2024 : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే-ts eapcet engineering admissions counseling to start from june 27 in telangana latest updates read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eapcet Counselling 2024 : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

TS EAPCET Counselling 2024 : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 24, 2024 05:43 PM IST

TS EAPCET (EAMCET) Counselling 2024 Updates : తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 27 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ - 2024
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ - 2024

TS EAPCET (EAMCET) Counselling Schedule 2024: తెలంగాణలో ఎంసెట్(TS EAPCET 2024) ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ అధికారులు వివరాలను వెల్లడించారు.

జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. జూన్‌ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్‌ ఆప్షన్లకు ఛాన్స్ కల్పించారు. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 16వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇక రెండో విడత కౌన్సెలింగ్ జులై 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడో విడత జూలై 30వ తేదీ నుంచి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జులై 24వ తేదీన ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉండగా,ఆగస్టు 5వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు.

స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 17వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేస్తారు. విద్యార్థులు రిపోర్టింగ్ చేసే సంఖ్యను బట్టి మిగిలే సీట్ల విషయంలో క్లారిటీ వస్తుంది. త్వరలోనే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

TS EAPCET ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ 2024- ముఖ్య తేదీలు

  • జూన్ 27, 2024 - ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం.
  • జూన్‌ 30, 2024 - ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు.
  • జులై 12, 2024 - ఫస్ట్ ఫేజ్ ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు.
  • జూలై 12- 16, 2024 - సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలి.
  • జులై 19, 2024 - ఇంజినీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం.
  • జులై 24, 2024 - సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు
  • జులై 30, 2024 - ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్.
  • ఆగస్టు 5, 2024 - ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు.
  • ఆగస్టు 17, 2024 - స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదల
  • అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tsche.ac.in/

ఈసారి తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో చూస్తే…. అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91633 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష రాశారు. కాగా ఇంజనీరింగ్‌ విభాగంలో 2 లక్షల 40వేల 618 మంది పరీక్ష రాశారు. ఈసారి మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీలో పురుషులు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహిళలు 90.18 శాతం క్వాలిఫై అయ్యారు. మొత్తం 89.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో అబ్బాయిలు…. 74.38 శాతం క్వాలిఫై అయ్యారు, అలాగే అమ్మాయిలు…. 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.

How to Check TS EAMCET Results 2024 : టీఎస్ ఎంసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ ఎంసెట్( ఈఏపీసెట్0 పరీక్ష రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • TS EAPCET - Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ చాలా కీలకం.

Whats_app_banner

సంబంధిత కథనం