YS Jagan : సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. రాష్ట్రానికి ఎంబీబీఎస్ అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం దారుణమన్నారు. ఇకనైనా కళ్లు తెరిచి లేఖను వెనక్కి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.