TS EAMCET 2023 : విద్యార్థులకు అలర్ట్... ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు-ts eamcet 2023 special phase admission counselling schedule revised check key details are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Eamcet 2023 : విద్యార్థులకు అలర్ట్... ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

TS EAMCET 2023 : విద్యార్థులకు అలర్ట్... ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

Aug 17, 2023, 08:12 PM IST Maheshwaram Mahendra Chary
Aug 17, 2023, 08:12 PM , IST

  • TS EAMCET Counselling 2023 Updates : ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి.ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కొత్త తేదీలను వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి....

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఇటీవలే రాష్ట్రంలో 4 కొత్త కాలేజీలు మంజూరు అయ్యాయి.  ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి.

(1 / 5)

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఇటీవలే రాష్ట్రంలో 4 కొత్త కాలేజీలు మంజూరు అయ్యాయి.  ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి.(tseamcet)

ఆగస్టు 17వ తేదీ నుంచి ఈనెల 22 వరకు ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.. ఈనెల 26న ప్రత్యేక విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

(2 / 5)

ఆగస్టు 17వ తేదీ నుంచి ఈనెల 22 వరకు ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.. ఈనెల 26న ప్రత్యేక విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.(unsplash.com)

ఆగస్టు  27 నుంచి 29 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. స్పాట్‌ అడ్మిషన్లకు ఈనెల 26న మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించారు.

(3 / 5)

ఆగస్టు  27 నుంచి 29 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. స్పాట్‌ అడ్మిషన్లకు ఈనెల 26న మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించారు.(unsplash.com)

తెలంగాణ ఎంసెట్(ఇంజినీరింగ్) రెండో విడత సీట్ల కేటాయింపు ఇటీవల పూర్తైంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు ప్రకటించారు. రెండో విడత‌లో కొత్తగా 7,417 మంది విద్యార్థుల‌కు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ తెలిపారు.

(4 / 5)

తెలంగాణ ఎంసెట్(ఇంజినీరింగ్) రెండో విడత సీట్ల కేటాయింపు ఇటీవల పూర్తైంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు ప్రకటించారు. రెండో విడత‌లో కొత్తగా 7,417 మంది విద్యార్థుల‌కు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ తెలిపారు.(unsplash.com)

ఈ ఏడాదికి సంబంధించి సీఎస్ఈలో 3వేలకుపైగా సీట్లు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. సివిల్‌ ఇంజినీరింగ్‌లో 2505, ఈసీఈలో 2721, ఈఈఈలో 2630, ఐటీలో 1785, మెకానికల్‌లో 2542 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది విడుత కౌన్సెలింగ్ తర్వాత… సీట్లకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.

(5 / 5)

ఈ ఏడాదికి సంబంధించి సీఎస్ఈలో 3వేలకుపైగా సీట్లు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. సివిల్‌ ఇంజినీరింగ్‌లో 2505, ఈసీఈలో 2721, ఈఈఈలో 2630, ఐటీలో 1785, మెకానికల్‌లో 2542 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది విడుత కౌన్సెలింగ్ తర్వాత… సీట్లకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.(unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు