AP EAPCET Key 2024 : ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్… వెబ్ సైట్ లో ప్రిలిమినరీ 'కీ', రెస్పాన్స్ షీట్లు - లింక్ ఇదే
AP EAPCET(EAMCET) 2024 Answer Key 2024: ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్)అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రాథమిక ‘కీ’ అందుబాటులోకి వచ్చింది. మే 25వ తేదీలోపు అభ్యంతరాలను పంపాల్సి ఉంటుంది.
AP EAMCET Answer Key 2024: ఏపీ ఈఏపీసెట్ 2024 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదలైంది. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి ప్రిలిమినరీ కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే మే 25వ తేదీలోపు పంపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా…. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని కూడా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
How to download AP EAPCET answer key 2024 - కీ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
- అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రాథమిక కీ కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే Master Question Papers & Preliminary Keys for AP EAPCET - 2024 అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఇక్కడ పరీక్ష రాసిన సెషన్ వివరాలు కనిపిస్తాయి. అందులో మీరు ఏ సెషనల్ లో అయితే రాశారో అక్కడ క్లిక్ చేయాలి. ప్రాథమిక కీ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ప్రాథమిక కీ కాపీని పొందవచ్చు.
- కీ పై అభ్యంతరాలు ఉంటే మే 25వ తేదీ ఉదయం 10 గంటలలోపు వెబ్ సైట్ నుంచే పంపాల్సి ఉంటుంది.
Response Sheet for AP EAPCET - 2024: వెబ్ సైట్ లో రెస్పాన్స్ షీట్లు…
- అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రాథమిక కీ కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే Response Sheet for AP EAPCET - 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ Registration Number , EAPCET Hallticket No ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- మీ రెస్పాన్స్ షీట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రెస్పాన్స్ షీట్ కాపీని పొందవచ్చు.
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ పరీక్షలను మే 16,17 తేదీల్లో 4 సెషన్స్ లోపూర్తి చేశారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు…. మే 18 నుండి 23 వరకు 9 సెషన్స్ లో నిర్వహించారు. రోజుకు రెండు సెషన్స్ లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించారు.
ఇక ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ మే 24వ తేదీన అందుబాటులోకి రానుంది. రెస్పాన్స్ షీట్లు కూడా విడుదల కానున్నాయి. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి… త్వరలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ఈఏపీసెట్ - 2024 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా షురూ కానుంది.