TS EAPCET Results 2024 : తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి
TS EAPCET Results 2024 : తెలంగాణ ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు ఉదయం 11 గంటలకు అందుబాటులోకి వస్తాయి. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లి అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఇక్కడ చూడండి….
TS EAPCET Results 2024 : తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) పరీక్షలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇవాళ(మే 18) ఉదయం 11 గంటలకు ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫలితాలను జేఎన్టీయూ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
How to Check TS EAPCET Results 2024: ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే TSEAPCET Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.
తెలంగాణ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమై… 11తో ముగిశాయి. మొత్తంగా ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా... వీరిలో 2,40,617 మంది పరీక్షలు రాశారు. ఇక ఫార్మసీ విభాగం పరీక్షలకు 1,00,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7, 8 తేదీల్లో నిర్వహించిన ఈఏపీసెట్(ఎంసెట్) పరీక్షల ప్రాథమిక కీలు ఇప్పటికే విడుదలయ్యాయి. ప్రాథమిక కీ లను వెబ్ సైట్ లో ఉంచారు. రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేశారు. వీటిని https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక కీలకమైన ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ప్రాథమిక 'కీ' లు కూడా జెఎన్టీయూ వెబ్ సైట్లో ఉన్నాయి.రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ గడువు కూడా పూర్తి కావటంతో… అతి తక్కువ వ్యవధిరలోనే తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు 2024 విడుదల అవుతున్నాయి.