కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, కాకరతో కొన్ని ఆహారాలను కలిపి తీసుకోకూడదు. కాకర తిన్న వింటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అలా.. కాకరకాయతో కలిపి తినకూడనివి ఏవో ఇక్కడ చూడండి.
Photo: Unsplash
కాకరకాయతో కలిపి పాలు తీసుకోకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత ఇబ్బంది ఎదురవుతుంది.
Photo: Unsplash
కాకరకాయ తిన్న వింటనే మామిడి పండు తినకూడదు. అలా చేస్తే ఎసిడిటీ, మంట కలిగే అవకాశం ఉంటుంది. అందుకే కాకర తిన్నాక కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాతే మామిడి పండు తీసుకోవాలి.
Photo: Pexels
కాకరకాయతో ముల్లంగిని కలిపి తినకూడదు. ఇలా చేస్తే గ్యాస్ సంబంధించిన ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి.
Photo: Unsplash
కాకరకాయ, పెరుగు కలిపి తినకూడదు. రెండు ఆరోగ్యకరమే అయినా మిక్స్ చేసుకొని మాత్రం తీసుకోకూడదు. వేర్వేరుగా తినాలి. ఈ రెండు కలిపి తింటే దురద లాంటి చర్మ ఇబ్బందులు తలెత్తే రిస్క్ ఉంటుంది.
Photo: Unsplash
కాకర, బెండకాయను కూడా కలిపి తీసుకోకూడదు. ఈ రెండు కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.
Photo: Unsplash
సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త