Saturn retrograde: శని తిరోగమనం.. రానున్న 5 నెలలు ఈ మూడు రాశుల వారికి చాలా కష్టాలు రాబోతున్నాయి
Saturn retrograde: కర్మల దేవుడు శని మరికొన్ని రోజుల్లో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. ఫలితంగా రానున్న ఐదు నెలల పాటు మూడు రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయి.
Saturn retrograde: జూన్ నెలలో కర్మల అధిపతి శని తిరోగమనం చెందబోతున్నాడు. ఇది కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను, కొందరికి సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. శని దేవుడినిి ప్రసన్నం చేసుకునేందుకు జూన్ నెలలో రెండు శుభప్రదమైన రోజులు ఉన్నాయి.
పంచాంగం ప్రకారం జూన్ 6వ తేదీ శని జయంతి వచ్చింది. అత్యంత ముఖ్యమైన ఈరోజు శని దేవుడిని ఆరాధిస్తే ఏలినాటి శని, అర్థాష్టమ శని వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున శని దేవుడిని పూజించిన వ్యక్తులకు కొన్ని సంవత్సరాల వరకు శని అనుగ్రహం పొందుతారు.
జూన్ నెలలో వచ్చే మరొక శుభకరమైన రోజు శని తిరోగమనం. జూన్ 29 నుంచి శని తిరోగమన దశలోకి వెళతాడు. ఈ స్థితి నవంబర్ 15 వరకు ఉంటుంది. శని ఈ దశ దశ మూడు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
శని తిరోగమనం వీరికి శుభం
వృషభం, కర్కాటకం, తులా రాశి జాతకులకు శని వల్ల అనుకూలమైన ఫలవంతమైన లాభాలు ఉంటాయి. ఈ కాలంలో వీళ్ళు ఆకస్మిక ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. కార్యాలయంలో విజయాలు సాధిస్తారు. పని లేదా వ్యాపార ప్రయోజనాల కోసం విదేశీ పర్యటనలు చేస్తారు. ఆరోగ్యం కూడా ఉత్తమంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్ లభించడంతో ఆనందంగా ఉంటారు. రాబోయే ఐదు నెలల పాటు శని అనుకూల ప్రభావంతో అనేక పనుల్లో విజయాలు పొందుతారు. సమాజంలో హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారులకు మంచి పెట్టుబడిదారులు దొరుకుతారు.
ఈ మూడు రాశులకు కష్టాలే
శని తిరోగమన ప్రభావంతో మూడు రాశుల వారికి శనీశ్వరుడి వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొని మొదటి రాశి మేష రాశి. వీరికి పనిలో ఆటంకాలు, సమస్యలు, సవాళ్లతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని చికాకు పెట్టె అవకాశం ఉంది.
శని సంబంధిత సమస్యలతో బాధపడే రెండో రాశి చక్రం వృశ్చిక రాశి. ఈ రాశుల జాతకులు జీవితంలో అనేక అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా వ్యాపారాన్ని నడుపుతున్నట్టయితే వాళ్ళు నష్టాలను భరించాల్సి వస్తుంది.
మకర రాశి ఈ సమయంలో మకర రాశి జాతకులకు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రయాణం చేయాల్సి వస్తుంది పిల్లల పురోహిత గురించి ఆందోళన చెందుతారు
శని దేవుడిని శాంతింప చేసే పరిహారాలు
కర్కాటకం, కుంభం, వృశ్చిక రాశి వారు శని దేవుడిని శాంతింప చేసేందుకు నూనె సమర్పించాలి. శని దేవుడి ఆలయానికి వెళ్లి నూనెతో దీపం వెలిగించాలి. నిరుదలకు ఆహారం లభించని వాళ్ళకు దానం చేయాలి శనివారం నాడు ఆవ నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పాటించాలి.